ఊపిరికి సీక్వెల్ రాబోతోందా?

Update: 2016-04-02 09:04 GMT
సినిమా స‌క్సెస్ సాధించిందంటే దానికున్న క్రేజ్ చాలా ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంటుంది. అందులో ఒక ఉప‌యోగం సీక్వెల్ చేసుకోవ‌డం. ఒక విజ‌య‌వంత‌మైన చిత్రానికి కొన‌సాగింపుగా మ‌రో సినిమా వ‌స్తోందంటే ఆటోమేటిక్‌ గా అంద‌రిక‌ళ్లూ అటువైపు తిరుగుతాయి. బిజినెస్ అవ‌లీల‌గా పూర్త‌వుతుంది. ప్రేక్ష‌కులూ క‌థ‌ని ఎలా కొన‌సాగించారో చూద్దాం అని ఆస‌క్తితో థియేట‌ర్ల‌వైపు అడుగులేస్తారు. అందుకే సీక్వెల్‌ ల గురించి ఇటీవ‌ల టాలీవుడ్ కూడా సీరియ‌స్‌ గా ఆలోచిస్తోంది. మొన్న‌టికి మొన్న సోగ్గాడే చిన్ని నాయ‌నా హిట్ట‌న‌గానే దానికి సీక్వెల్ కూడా సిద్ధం అంటూ బంగార్రాజు టైటిల్‌ ని రిజిస్ట‌ర్ చేయించారు. ఇప్పుడు నాగార్జున మ‌రో సీక్వెల్ కూడా ప్ర‌క‌టించాడు.

ఇటీవ‌లే కార్తీతో క‌లిసి ఊపిరిలో న‌టించాడు నాగార్జున‌. ఆ చిత్రం త‌మిళంలోనూ తోజాగా విడుద‌లైంది. క్రిటిక‌ల్‌ గా మంచి అప్రిసియేష‌న్ పొందిన ఆ సినిమాకి సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందా అని చిత్ర‌బృందం ఆలోచిస్తోంద‌ట‌. ఫ్రెంచిలో విజ‌య‌వంత‌మైన ది ఇన్‌ ట‌చ‌బుల్స్‌ కి రీమేక్‌ గా ఊపిరి తెర‌కెక్కింది. అయితే అక్క‌డ సీక్వెల్ మాత్రం చేయ‌లేదు. కానీ నాగ్ మాత్రం ఈ కథ‌ని పొడిగించొచ్చు అని చెప్పాడ‌ట‌. దీంతో ద‌ర్శ‌కుడు కూడా ఆ దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆ విష‌యం గురించి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతుండ‌గానే నాగార్జున‌ - కార్తీ ఇద్ద‌రూ సీక్వెల్ ఉంద‌ని ప్ర‌క‌టించేశారు. తోజా స‌క్సెస్‌ మీట్ చెన్నైలో జ‌రిగింది. ఆ వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ తోజా2 కూడా ఉంద‌ని, మ‌ళ్లీ కార్తీ తానూ క‌లిసి న‌టిస్తామ‌ని చెప్పారు. కార్తీ కూడా అదే విష‌యం చెప్పాడు. అంతే కాదు... త‌న త‌మిళ్ డ‌బ్బింగ్‌ కి మంచి అప్రిషియేష‌న్ వ‌చ్చింద‌ని, రిసీవ్ చేసుకున్న అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని చెప్పాడు నాగార్జున‌.
Tags:    

Similar News