మీరే మెగా ఎంపరర్ -నాగార్జున

Update: 2017-01-25 05:31 GMT
ఖైదీ నంబర్ 150.. పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సెన్సేషనల్ మూవీ. వచ్చీ రావడంతోనే టాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టేస్తున్నారు చిరు. పలు ఏరియాల్లో ఆల్ టైం రికార్డులు.. మిగిలిన ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులు చిరు సొంతం అయిపోయాయిప్పటికే.

ఖైదీ నంబర్ 150 సక్సెస్ సందర్భంగా మెగాస్టార్ ను సన్మానించేందుకు టి సుబ్బిరామిరెడ్డి ఆత్మీయ వేడుక నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. చిరంజీవిని మెగా ఎంపరర్ ఆఫ్ టాలీవుడ్ అంటూ పొగిడేశారు.

'కంగ్రాట్స్ చరణ్..  కంగ్రాట్స్ చిరంజీవి గారు' అంటూ ప్రారంభించిన నాగ్.. 'తెలుగువాళ్లు.. తెలుగు ప్రజలు మిమ్మల్ని ఇలా చూడాలని అనుకుంటున్నారు. ఎలాంటి వాదన లేకుండా మీరే మెగా ఎంపరర్ ఆఫ్ తెలుగు సినిమా నిరూపించుకున్నారు. మీకు గుర్తుందో లేదో.. నేను ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేశాను. ఖైదీ బ్లాక్ బస్టర్ అవుతుందని ట్వీట్ చేశాను. మీరు అన్ని రికార్డులను తుడిచి పెట్టేశారు' అన్నారు నాగార్జున

'మేము ఏది అసాధ్యం అని అనుకున్నామో.. దాన్ని మీరు సుసాధ్యం చేసి చూపించారు. బాక్సాఫీస్ గేట్లను బార్లా తెరిచేశారు' రికార్డుల విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'ఇక డ్యాన్సుల గురించి ఏం చెప్పాలి.. మెస్మరైజ్ చేశారు' చిరంజీవి డ్యాన్సులను ప్రత్యేకంగా అభినందించడం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News