టాలీవుడ్ నే కాదు.. టోటల్ సినీ పరిశ్రమనే పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. సినిమాలు రిలీజ్ అయ్యే ముందే నెట్లో దర్శనమిస్తూ మేకర్లను నిద్రలో కూడా వెంటాడుతోందీ భూతం. ఎంతమంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడంలేదు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ఫోర్త్ ఎస్టేట్ పేరుతో ప్రసారమయ్యే ఓ న్యూస్ ఛానల్ ప్రోగ్రాంకి హాజరయ్యారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు కేటీఆర్. ఇదే సమయంలో సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున కూడా కేటీఆర్ తో లైవ్ లో మాట్లాడారు. సినిమా రంగం మొత్తం తరపు నుంచి కేటీఆర్ కు ఓ విన్నపం చేశారు నాగార్జున. టాలీవుడ్ ని పైరసీ పట్టి పీడిస్తోందని. దీన్ని అరికడితే ఇండస్ట్రీకే కాక, రాష్ట్రప్రభుత్వానికి కూడా ఆదాయం రూపంలో మేలు జరగుతుందని అన్నారు నాగ్. పైరసీని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతానని కేటీఆర్ వాగ్దానం కూడా ఇచ్చారు.
ఇప్పుడు నాగ్ తన సినిమా సోగ్గాడే చిన్ని నాయన రిలీజ్ కానుండడంతో.. పైరసీపై మాట్లాడుతున్నారు. తర్వాత మళ్లీ దీని విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఈయనే కాదు.. అందరూ ఇలాగే ఉన్నారు. దర్శకధీరుడుగా గుర్తింపుపొంది, టాలీవుడ్ కి బాహుబలి లాంటి చరిత్ర సృష్టించిన సినిమా ఇచ్చిన రాజమౌళి.. అప్పుడెప్పుడో ఈగ సమయంలో పైరసీ అని హడావిడి చేశాడు. ఆ తర్వాత మళ్లీ బాహుబలి సీన్స్ లీక్ అయినపుడు, ఆ తర్వాత విడుదల సమయంలోనూ హంగామా చేశారు. మళ్లీ తర్వాత సైలెంట్ అయిపోయారు. అసలు సినీ రంగం అంతా ఒక్క తాటి పైకి వచ్చి, అందరినీ పీడిస్తున్న సమస్య పై ఎప్పుడు పోరాటం చేస్తారో!