చై- సామ్ గుట్టు కుక్క క‌నిపెట్టింది!

Update: 2019-03-31 17:28 GMT
అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత ప్రేమాయ‌ణం ఆల్వేస్ హాట్ టాపిక్. అస‌లు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణం ఎప్పుడు మొద‌లైంది? ఎలా మొద‌లైంది? ఎన్నేళ్ల పాటు సాగింది? ఆ త‌ర్వాత ముందుగా ఎవ‌రు ఎవ‌రికి ప్ర‌పోజ్ చేశారు?  మొద‌ట‌గా అంగీక‌రించిన‌ది ఎవ‌రు? ఇలా ర‌క‌ర‌కాలుగా అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. అయితే స‌మంత‌, చైత‌న్య ప్రేమ‌క‌థ ఎప్పుడు మొద‌లైంది? అన్న‌దానికి కింగ్ నాగార్జున మ‌జిలీ ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా గుట్టు లీక్ చేసేశారు. అంతేకాదు ఆ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ‌ను క‌నిపెట్టింది ముందుగా ఎవ‌రో తెలుసా? అంటూ కింగ్ పెద్ద ట్విస్టునే రివీల్ చేశారు.

నాగ‌చైత‌న్య - స‌మంత మ‌ధ్య ప్రేమ `ఏ మాయ చేశావే` స‌మ‌యంలోనే మొద‌లైంది. ఆ ఇద్ద‌రినీ జంట‌గా చూసిన‌ప్పుడు పెయిర్ చాలా బావుందే అనుకున్నాను. అయితే ఆ త‌ర్వాత అస‌లేం జ‌రుగుతోందో నాకు తెలీదు. గుట్టు చెప్ప‌కుండా న‌న్ను మాయ చేశారు. అయితే ఓసారి స‌మంత మా ఇంటికి వ‌చ్చింది. అప్పుడు త‌న వ‌ద్ద‌కు మా కుక్క ప‌రిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. అరే దీనికి ఎలా తెలుసు స‌మంత‌? అంటే .. దానికి నేను తెలుసు మామా! అని చెప్పింది సామ్ అంటూ న‌వ్వేశారు. అంటే స‌మంత - చైత‌న్య గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్రేమించుకుంటున్న సంగ‌తిని ఆ కుక్క క‌నిపెట్టేసింద‌న్న‌మాట‌.

అదెలా సాధ్యం అంటే.. అప్ప‌టికే చైతూతో క‌లిసి ఆ ఇంటికి సామ్ వ‌చ్చి వెళ్లింది. అంటే కుక్క‌కు ముందే ప‌రిచ‌య‌మైంది సామ్. ఒక‌సారి ప‌రిచ‌య‌మైన అతిధిని కుక్క అంత తేలిగ్గా వ‌దిలేస్తుందా? అలా సామ్ రాగానే వెంట‌నే త‌న‌వ‌ద్ద‌కు వెళ్లింద‌న్న‌మాట‌! ఇంత మ్యాట‌ర్ ర‌న్ అయినా కింగ్ నాగార్జున‌కు తెలియ‌దు పాపం. మొత్తానికి సినిమా ప్రేమ‌క‌థ‌లా చై- సామ్ రియ‌ల్ ప్రేమ‌క‌థలో పెద్ద డ్రామానే ఉంద‌న్న‌మాట‌. అయితే ఆ ప్రేమ వ‌ర్క‌వుట్ కావ‌డానికి ఏడెనిమిదేళ్ల సుదీర్ఘ స‌మ‌యం ప‌ట్టింది. ఒక‌రికొక‌రు ప్ర‌పోజ్ చేసుకోవ‌డానికి త‌ర్వాత ఓకే అనుకోవ‌డానికి.. టైమ్ తీసుకున్నారు. ఒక‌సారి ల‌వ్ ని ఖాయం చేసుకున్న త‌ర్వాత మాత్రం ఇక వెనుదిరిగి చూసిందేం లేదు. 2017లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇప్ప‌టికే రెండేళ్ల ప్ర‌యాణం సాగింది.


Tags:    

Similar News