‘హలో’ ఫస్ట్ లుక్ అలా లీకైందట

Update: 2017-08-29 08:19 GMT
అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘అఖిల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అఫీషియల్ గా లాంచ్ కాకముందే సోషల్ మీడియాలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రమేయం లేకుండా ఫస్ట్ లుక్ బయటికి వచ్చేయడంతో.. ఇక చేసేది లేక అనుకున్న దాని కంటే ఈ పోస్టర్ ను అధికారికంగా లాంచ్ చేశాడు నాగార్జున. ఐతే ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి చిత్ర బృందమే కావాలని ఇలా లీక్ చేసిందన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై నాగార్జున స్పందించాడు. హైప్ కోసం అలాంటి చీప్ ట్రిక్స్ చేయాల్సిన అవసరం తమకు లేదని నాగ్ స్పష్టం చేశాడు. ఈ ఫస్ట్ లుక్ కావడానికి అసలు కారణమేంటో నాగ్ వివరించాడు.

‘హలో’ డైరెక్టర్ విక్రమ్ కుమార్ హాంకాంగ్ లో ఉండే తన ఫ్రెండుకు ఈ లుక్‌ ను డిజైనింగ్ కోసం పంపించాడని.. ఆ వ్యక్తే ఇంతకుముందు ‘మనం’ పోస్టర్లు కూడా డిజైన్ చేశాడని.. ఐతే ఆ డిజైనర్ తన గర్ల్ ఫ్రెండుకు ఈ స్టిల్ షేర్ చేయడంతో ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టేసిందని.. అలా అఖిల్ రెండో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి వచ్చిందని.. అంతే తప్ప అందులో తమ ప్రమేయం ఏమీ లేదని నాగ్ స్పష్టం చేశాడు. ఈ చిత్రానికి ‘హలో’ అనే టైటిల్ పెట్టింది తానేనని కూడా నాగ్ వెల్లడించాడు. టైటిల్ గురించి ఆరు నెలలుగా ఆలోచిస్తున్నామని.. ఐతే ఒక రోజు ఉదయం వ్యాయామం చేసే సమయంలో తనకు ఈ టైటిల్ తట్టిందని.. మామూలుగానే తనకు ఉదయం మంచి ఆలోచనలు వస్తుంటాయని నాగ్ తెలిపాడు.
Tags:    

Similar News