నాగ్ ఓపెన్‌ గా చెప్పేశాడు!

Update: 2015-08-23 07:45 GMT
కార్తీతో క‌లిసి త‌మిళ్‌, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు నాగార్జున‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో పీవీపీ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఆ సినిమా `ఇన్‌ ట‌చ‌బుల్స్‌` అనే ఫ్రెంచ్ చిత్రం స్ఫూర్తితో తెర‌కెక్కుతోంద‌ని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది.  కానీ చిత్ర‌బృందం మాత్రం ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. నాగ్‌, కార్తీ, త‌మ‌న్నాల‌తో కూడిన కొన్ని స్టిల్స్ ఇటీవ‌లే ఆన్‌ లైన్‌ లో బ‌య‌టికొచ్చాయి. అవి అచ్చం  `ఇన్‌ ట‌చ‌బుల్స్‌`లోని స్టిల్స్‌ ని పోలిన‌ట్టుగానే ఉన్నాయి. ఆ రెండు సినిమాల స్టిల్స్‌ ని ప‌క్క‌ప‌క్క‌నే చూపిస్తూ `ప‌క్కాగా ఇది ఫ్రెంచ్  సినిమాకి కాపీనే` అని ఖరారు చేశారు సినీ విశ్లేష‌కులు. చిత్ర‌బృందం నుంచి మాత్రం ఎటువంటి స్పంద‌న రాలేదు. అయితే ఇటీవ‌ల నాగార్జున మాత్రం ``అవును... మేం చేస్తున్న‌ది `ఇన్ ట‌చ‌బుల్స్‌` సినిమానే. దానికి రీమేక్‌ గా మా చిత్రం తెర‌కెక్కుతోంద‌``ని విలేక‌రుల‌తో ఓపెన్‌ గా చెప్పేశాడ‌ట‌.

సినిమాలో చాలావ‌ర‌కు నాగార్జున స్ట్రెచ‌ర్‌ పైనే కూర్చుని క‌నిపిస్తాడ‌ట‌. కానీ ఆ స‌న్నివేశాలు హిలేరియ‌స్‌ గా ఉంటాయ‌ట‌. వంశీ అంత‌కుముందు కూడా `ఫేస్ ఆఫ్‌` అనే ఓ ఇంగ్లిష్ సినిమా స్ఫూర్తితోనే `ఎవ‌డు` అనే సినిమా చేశాడు.  ఆయ‌న ఇంగ్లీష్ సినిమాల్ని తెలుగుకి త‌గ్గ‌ట్టుగా బాగా మౌల్డ్ చేస్తాడ‌ని పేరుంది. ఆ న‌మ్మ‌కంతోనే నాగ్ సినిమాకి ఓకే చెప్పేశాడ‌ట‌. ఈసారి వంశీ పైడిప‌ల్లి ఫ్రెంచ్ సినిమాని తెలుగులో చూపించ‌బోతున్నాడ‌న్న‌మాట‌.
నాగార్జున ఎప్పుడూ ఏదీ దాచుకోరు. ఓపెన్‌ గా చెప్పేస్తారు. ఇప్పుడు ఎక్క‌డ్నుంచి  ఏ సీన్ కాపీ కొట్టినా, ఏ సీన్ నుంచి స్ఫూర్తి పొందినా జ‌నాలు ఈజీగా క‌నిపెట్టేస్తున్నారు. అలాంట‌ప్పుడు ఇంకా దాచిపెట్ట‌డం ఎందుకనేది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల భావ‌న‌. స్ఫూర్తిగా తీసుకొన్నా, స‌న్నివేశాల్ని కాపీ కొట్టినా ఆ విష‌యాన్ని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. నాగ్ కూడా అదే చేశారిప్పుడు.
Tags:    

Similar News