నాగ్ ఫ్యాన్స్ అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు

Update: 2015-11-17 13:30 GMT
ఇప్పుడు కొంచెం సాత్వికమైన పాత్రలే చేస్తున్నాడు కానీ.. నాగార్జున ఒకప్పుడు పెద్ద మాస్ హీరోనే. ప్రతి సినిమాలో హీరోయిజం ఉండాల్సిందే, ఫైట్లు చేయాల్సిందే. మాస్ లో ఆయనకు అలాంటి ఫాలోయింగ్ ఉంది మరి. ఐతే ఇప్పటి ఆడియన్స్ టేస్టు మారడంతో యాక్షన్ మీద, హీరోయిజం మీద అంత దృష్టిపెట్టట్లేదు. ‘మనం’లో యాక్షన్ ఊసే లేకున్నా ఆ సినిమా అద్భుతంగా ఆడింది కదా. రాబోయే ‘ఊపిరి’ కూడా ఇలా మనసు తలుపులు తట్టే సినిమానే అట. అందులో నాగార్జున ఓ షాకింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కుర్చీకి అతుక్కుపోయి ఉండే పాత్ర ఇది. నాగ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి రోల్ చేయడం నిజంగా సెన్సేషనే. నాగ్ లాంటి ఇమేజ్ ఉన్న మరే హీరో కూడా ఇలాంటి పాత్రకు ఒప్పుకుని ఉండడు. సినిమాలో ఏవో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నాగ్ ఇలా కూర్చుని ఉంటాడనుకుంటే పొరబాటే. సినిమా అంతా కూడా నాగ్ కుర్చీకి అతుక్కుపోయే ఉంటాడట. నాగ్ హీరోయిజం చూపించే అవకాశమే ఉండదట. అసలు సినిమా అంతటా కూడా యాక్షన్ సన్నివేశాలేమీ ఉండవని.. కామెడీ - ఎమోషన్స్ మీదే సినిమా నడుస్తుందని అంటున్నారు. నాగ్ పాత్ర కన్నీళ్లు పెట్టించేస్తుందని సమాచారం. కాబట్టి నాగ్ మాస్ ఫ్యాన్స్ ఆయన పాత్ర విషయంలో వేరే ఆశలేమీ పెట్టుకోకుండా ఓపెన్ మైండ్ తో సినిమా చూడ్డానికి రెడీ అవ్వాల్సిందే.
Tags:    

Similar News