మే 23 గురించి కొత్తమాట చెప్పిన నాగ్

Update: 2018-05-23 11:20 GMT
ఒక్కోసారి అక్కినేని నాగార్జునను చూస్తుంటే.. బహుశా ఏ కొడుకు కూడా తన తండ్రికి అన్నేసి సార్లు నీరాజనాలు తెలిపి ఉండరేమో అనిపిస్తుంటుంది. ప్రతీ ఏటా సమయం సందర్బం వచ్చినప్పుడల్లా ఆయన తండ్రి.. లెజండరీ అక్కినేని నాగేశ్వరరావును గుర్తుచేసుకుంటూనే ఉంటారు. పుట్టినరోజు నుండి ఆయన శాశ్వతంగా భూమిని వదిలి వెల్ళిపోయిన రోజు వరకు.. నాగ తండ్రి కోసం #ANRLivesOn అంటూ అంజలి ఘటిస్తూనే ఉంటారు.

ఇకపోతే మే 23 కూడా నాగార్జున అండ్ అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఆ రోజునే అక్కినేని వారి చివరి సినిమా అయిన ''మనం'' రిలీజైంది. ఆఖరిసారిగా ఆయన తెరపై కనిపించింది వినిపించింది ఆ సినిమాలోనే. పైగా ఆ సినిమాను ఆయన క్యాన్సర్ తో నరకం అనుభవిస్తున్న సమయంలో చేయడం.. అలాగే తనకు ఏమైనా అయితే ప్రాజెక్టుకు నష్టం వస్తుంది కాబట్టి.. ముందు క్లయిమ్యాక్స్ షూట్ చేసుకుని తన పాత్ర వరకు డబ్బింగ్ చెప్పించుకోమని నాగ్ కు చెప్పడం.. అవన్నీ సినిమాకు ఎంతో కలిసొచ్చాయి. అందుకే నాగ్ ఏమంటున్నారంటే.. ''మే 23 మాకు ఎంతో స్పెషల్. ఆ రోజు నాన్నగారి ఆఖరి సినిమా రిలీజైంది. యాథృచ్చికమో లేదంటే ఈ విశ్వం అలా నెంబర్ల ధర్మాన్ని పాటిస్తుందో తెలియదు కాని.. మే 23నే నా తొలి సినిమా విక్రమ్ కూడా రిలీజైంది'' అంటూ ఒక కొత్త విషయాన్ని చెప్పారు.

అంతేకాదు.. ''మనం'' సినిమా రిలీజై నాలుగు ఏళ్ళు పూర్తి కావొస్తున్న సమయంలో.. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేయని పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు కూడాను. ఇకపోతే మనం సినిమాలో నాగ్ ప్రస్తుత కుటుంబం.. సమంతతో సహా.. అందరూ యాక్ట్ చేయడం అనేది కూడా ఒక గొప్ప అద్భుతంగానే చెప్పాలి.
Tags:    

Similar News