అక్కినేని నాగచైతన్య- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' మూవీ ఈ నెల 26న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే పాటలు మార్కటె్లో సందడి చేస్తుండగా.. ఇప్పుడు ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు నిర్మాత నాగార్జున.
ఈ సినిమా ట్రైలర్ చివర్లో చైతు చెప్పిన 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' డైలాగ్ తో తన స్పీచ్ ను ప్రారంభించి 'నేనొప్పుకోను' అంటూ ఆడిటోరియంలో నవ్వులు పూయించారు నాగ్. 'అక్కినేని అభిమానులను చూసి చాలా కాలం అయింది. వారిని చూసేందుకే ఈ వేడుక ఏడాది క్రితం మా ఇద్దరి కొడుకులపై కెరీర్ కాన్సంట్రేట్ చేసి.. రెండు బ్లాక్ బస్టర్స్ ఇస్తాను అని ప్రామిస్ చేశాను. మొదటి బ్లాక్ బస్టర్ రారండోయ్ వేడుక చూద్దాం. రెండో బ్లాక్ బస్టర్ పనిలో అఖిల్ ఉన్నాడు. అందుకే రాలేకపోయాడు. చైతు సినిమా బ్లాక్ బస్టర్ అనేందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్ దేవిశ్రీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండడంతో రాలేకపోయాడు. తన కెరీర్ మన్మథుడుతో మొదలైందని దేవిశ్రీ చెబుతూ ఉంటాడు. ఈ మూవీలో మంచి పాటలు ఇచ్చాడు. సినిమా పూర్తయ్యాక మరో పాట చేస్తా అని తనే ఇచ్చాడు' అన్నారు నాగార్జున.
'కళ్యాణ్ కృష్ణ బాగా రాస్తాడు. కేరక్టర్స్ బాగా రాస్తాడు. నాకు బంగార్రాజు మాదిరిగానే.. ఈ సినిమాలో రకుల్ కి భ్రమరాంబ పాత్ర. చైతన్యకు ఇచ్చిన శివ పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక వేడుకలాగా ఈ సినిమా ఉందంటే కెమేరామెన్ విషు కారణం' అంటూ టెక్నీషియన్స్ ను ప్రశంసించారు నాగార్జున.