బ్ర‌హ్మాస్త్రం: బ్లాక్ లో కింగ్ లా దిగాడు!

Update: 2019-03-05 11:56 GMT
కింగ్ నాగార్జున దాదాపు 15 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా 2019 మోస్ట్ అవైటెడ్ మ‌ల్టీస్టార‌ర్ బ్ర‌హ్మాస్త్ర చిత్రంతో అక్క‌డ అడుగు పెడుతుండ‌డంతో ఒకటే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌ల్టీస్టార‌ర్ల ట్రెండ్ లో ఆయ‌న అటు బాలీవుడ్, మాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ల‌కు అంగీక‌రించ‌డంపై టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ లో ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌లో నాగార్జున పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుందట‌. ఆ క్ర‌మంలోనే నిన్న‌టి రోజున ఈ సినిమా లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి నాగ్ విశిష్ఠ అతిధిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌యాగ (కాశీ)లోని కుంభ‌మేళా జ‌రిగే చోట నింగిలో ఈ లోగోని చిత్ర‌యూనిట్ ఆవిష్క‌రించింది. మేళాకు విచ్చేసిన శివ‌భ‌క్తుల స‌మ‌క్షంలో ప్ర‌మోష‌న‌ల్‌ బ్ర‌హ్మాస్త్రాన్ని సంధించింది టీమ్.

ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న నాగార్జున ఆయ‌న లుక్ తోనే బ్ర‌హ్మాస్త్రం సంధించారు. టాప్ టు బాట‌మ్ బ్లాక్ & బ్లాక్ లుక్ లో క‌నిపించిన నాగార్జున ఆ మెడ‌లో బ్యాగ్ ని కూడా ప‌క్కాగా బ్లాక్‌ లెద‌ర్ బ్యాగ్ నే ఎంపిక చేసుకున్నారు. క‌ళ్ల‌కు గాగుల్స్ బ్లాక్ రేబాన్ మెరిపించింది. మొత్తానికి కింగ్ లుక్ బ్లాక్ బ‌స్ట‌ర్. ఇక బ్ర‌హ్మాస్త్ర ఇంకెంత బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందో అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.  హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ నిర్మిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్త‌యింది. ఈ లోగో విడుద‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌ణ‌భీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ, నాగార్జున‌ ప్ర‌యాగ‌కు వెళ్లారు. హీరోయిన్ అలియా భ‌ట్ త‌న ఇన్‌స్టా గ్రామ్ ద్వారా లైవ్‌లో ప్రోగ్రాం వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో బ్ర‌హ్మాస్త్ర అనే లోగోను ఆకాశంలో ఆవిష్క‌రించడం హైలైట్‌. ఇలా డ్రోన్స్ స‌హాయంతో ఆకాశంలో లోగోను ఆవిష్క‌రించ‌డం సినిమా చరిత్ర‌లో ఇదే తొలిసారి. నింగిలో బ్ర‌హ్మాస్త్ర లోగో  వీక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. బ్ర‌హ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌టి భాగాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 25 డిసెంబ‌ర్ 2019న హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌లయాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇత‌ర భాగాల్ని త‌దుప‌రి తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు సాగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News