మన స్టార్ హీరోలందరికీ నిర్మాతల సాదకబాధకాల గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ల ఇంట్లోనే నిర్మాతలున్నారు కాబట్టి. అందుకే బడ్జెట్ అదుపు దాటకుండా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు. అవసరం లేకపోయినా... నిర్మాతలకి తగిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆ విషయంలో అక్కినేని నాగార్జున మరింత పకడ్బందీగా వ్యవహరిస్తుంటారు. సినిమా తన నిర్మాణంలో తెరకెక్కుతున్నా, వేరేవాళ్లు నిర్మాతలైనా అన్నీ దగ్గరుండి చూసుకొంటుంటారు. దేనికెంత ఖర్చు పెడుతున్నారో అడిగి తెలుసుకొంటుంటారు. తన కొడుకు అఖిల్ కథానాయకుడిగా చేస్తున్న తొలి సినిమా విషయంలోనూ నాగ్ అన్ని జాగ్రత్తలూ తీసుకొంటున్నారట. సినిమాకి కొబ్బరికాయ కొట్టినరోజునే ఎంత బడ్జెట్లో పూర్తి చేయాలో నిర్మాతగా వ్యవహరిస్తున్న నితిన్‌కి చెప్పాడట. తన కొడుకు సినిమా కాబట్టి భారీగా ఉండాలి, అంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టాలి అనేమీ చెప్పలేదట నాగ్.
అఖిల్ సినిమాని 30కోట్లలోపు పూర్తి చేస్తేనే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చాడట. అయితే ఇటీవల సినిమా బడ్జెట్ కాస్త అదుపు తప్పిందని సమాచారం. వినాయక్ దర్శకత్వం అంటే అంతా భారీగా ఉంటుంది వ్యవహారం. అందుకే అనుకొన్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అవుతోందని లెక్కతేలిందట. ఆ విషయం తెలుసుకొన్న నాగ్ నితిన్‌ని పిలిపించి చిన్నపాటి క్లాస్ తీసుకొన్నట్టు తెలిసింది. కొత్త కథానాయకుడి సినిమా కాబట్టి మార్కెట్ పరంగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేయాలని చెప్పాడట. తన కొడుకు సినిమా అయినప్పటికీ నిర్మాత గురించి ఆలోచించి బడ్జెట్‌ని అదుపు చేయాలని సూచిస్తున్న నాగ్‌ని నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా!