మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న దేవదాస్ కోసం నాగార్జున ఫ్యాన్స్ నాని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ తో పాటు ఆడియో కూడా మంచి అంచనాలు రేపడంతో ఓపెనింగ్స్ పరంగా ట్రేడ్ కూడా గట్టి నమ్మకమే పెట్టుకుంది. ఈ దశలో తాజాగా నాగార్జున చేసిన ట్వీట్ వాళ్లలో ఉత్సాహాన్ని రేపుతోంది. కుటుంబంతో కలిసి సినిమా చూశానని జేబులో విజేతను పెట్టుకుని సెలవుల కోసం విదేశాలకు వెళ్తున్నానని చెప్పిన నాగ్ రేపు విజయానందాన్ని ఆస్వాదించేందుకు ఇక్కడ ఉండటం లేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మీద కొన్ని చురకలు వేసిన నాగ్ సదుద్దేశంతో అన్నా అది వేరే రకంగా మెసేజ్ వెళ్లిపోవడంతో దాని మీద కొంత చర్చ జరిగింది. అది గుర్తించాడు కాబోలు నాగ్ వెంటనే ఈ రూపంలో క్లారిటీ ఇచ్చేసాడు. జేబులో విన్నర్ అన్నాడు అంటే ఖచ్చితంగా హిట్ అయ్యే తీరుతుంది అన్న నమ్మకాన్ని వ్యక్తం చేసినట్టే. సో రిజల్ట్ గురించి నాగ్ అంత భరోసా ఇచ్చాక అభిమానులు ఆందోళన చెందడానికి ఏముంటుంది.
ఓవర్సీస్ లో సైతం నాగ్ నానిల కెరీర్ లోనే అత్యధిక లొకేషన్స్ లో విడుదల కాబోతున్న దేవదాస్ తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి రికార్డులు సెట్ చేసే అవకాశం ఉంది. పోటీలో ఉన్న మణిరత్నం నవాబ్ మీద ఇక్కడ ఏమంత బజ్ లేకపోవడం దేవదాస్ కి అనుకూలంగా మారనుంది. మణిశర్మ ట్యూన్స్ ఇప్పటికే జనానికి కనెక్ట్ అయిపోగా డాన్ దేవాగా నాగ్ డాక్టర్ దాస్ గా నానిల కాంబో మంచి హిలేరియస్ గా కనిపిస్తోంది.
గీత గోవిందంతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న మళ్ళి రావాలో ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్ హీరొయిన్లు కావడం ప్లస్ పాయింట్ గా మారింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ విలన్ గా దేవదాస్ తో డెబ్యూ చేస్తున్నాడు. కాస్టింగ్ భారీగా ఉన్న దేవదాస్ లో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. మరి అవి ఎంత వరకు నిలుస్తాయో తెలియాలంటే రేపటి దాకా ఆగాలి మరి.