మళ్లీ అతడే బిగ్ బాస్‌.. ఇదే సాక్ష్యం

Update: 2023-07-13 10:46 GMT
తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా వచ్చిన విషయం తెల్సిందే. మొత్తం ఏడు తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో మొదటి సీజన్ కు ఎన్టీఆర్.. తదుపరి సీజన్ కు నాని హోస్టింగ్‌ చేయగా మిగిలిన అన్ని సీజన్ లకు కూడా నాగార్జున హోస్టింగ్ చేశారు.

సీజన్ 6 ముగింపు సమయం లోనే తదుపరి సీజన్ కు నాగార్జున హోస్టింగ్ చేయడం లేదు అంటూ ప్రచారం మొదలైంది. అప్పటి నుండి మొన్నటి వరకు కూడా బిగ్ బాస్ తెలుగు కి కొత్త హోస్ట్‌ వస్తాడు అనే వార్తలు వచ్చాయి. షో నిర్వాహకులు బాలయ్య మొదలుకు ని విజయ్ దేవరకొండ వరకు ఎంతో మంది తో సంప్రదింపులు జరిపారనే వార్తలు కూడా వచ్చాయి.

బిగ్ బాస్ సీజన్‌ 7 కి హోస్ట్‌ గా నాగార్జున వ్యవహరించబోతున్నాడని తెలుస్తోంది. తాజాగా కొత్త సీజన్ కోసం ప్రోమో చిత్రీకరణ చేశారు. అందుకు సంబంధించిన ఒక ఫోటో ను షో నిర్వాహకులు లీక్ చేశారు. అందులో నాగార్జున 7 సంఖ్య ను చూపిస్తూ ఉండటంతో బిగ్ బాస్ సీజన్‌ 7 కి హోస్ట్‌ ఆయనే అంటూ తేలిపోయింది.

ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి అంటూ సోషల్‌ మీడియా లో బిగ్‌ బాస్ ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు. తెలుగు స్టార్స్ అందరి లోకి నాగార్జున మాత్రమే బిగ్‌ బాస్ షో కి న్యాయం చేస్తాడని.. అందుకే ఆయన్నే మళ్లీ తీసుకు రావడం... ఆయన్ను కొనసాగించడం సంతోషంగా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ఇక ప్రోమో లో నాగార్జున డిఫరెంట్ స్టైలిష్‌ లుక్ లో కనిపిస్తున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గడ్డం మరియు పొడవాటి జట్టు తో నాగార్జున భలే ఉన్నాడు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఇదే గెటప్‌ తో బిగ్‌ బాస్ స్టేజ్‌ పై సందడి చేయాల ని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక షో విషయాని కి వస్తే కంటెస్టెంట్స్ విషయంలో చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు లో కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అవ్వబోతుంది. షో మొదటి ఎపిసోడ్‌ ను సెప్టెంబర్ లో ప్లాన్‌ చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 అనౌన్స్మెంట్‌ ప్రోమోను ఇదే నెల లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

Similar News