వెంకీమామకు విషెస్ చెప్పిన నాగ్.. ఆఖిల్

Update: 2019-12-13 09:46 GMT
విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన 'వెంకీమామ' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇద్దరూ హీరోలు ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్నారు.  ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు కావడంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఈ సినిమాకు జోరుగానే ప్రచారం కల్పించారు.  రానా దగ్గుబాటి కూడా స్వయంగా రంగంలోకి దిగి మరీ ప్రచారం చేపట్టారు. అయితే దగ్గుబాటి కుటుంబం నుంచి ఎంత మద్దతు ఉన్నప్పటికీ అక్కినేనివారు ఎందుకో ఈ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్నారని రిలీజ్ కు ముందు గుసగుసలు వినిపించాయి.

అయితే నాగార్జున.. అఖిల్ ఇద్దరూ నిన్న రాత్రి 'వెంకీమామ' కు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్స్ చెయ్యడంతో ఆ విమర్శలకు.. గుసగుసలకు ఫుల్ స్టాప్ పడింది.  నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'చైతన్య అక్కినేని అండ్ టీమ్ కు వెంకీమామ విడుదల సందర్భంగా అల్ ది బెస్ట్" అని వెంకీమామ టీమ్ మెంబర్స్ అందరి పేర్లను నాగ్ టాగ్ చేశారు. ఇక అఖిల్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా "విక్టరీ వెంకీ మామకు.. మా సైలెంట్ కిల్లర్ బ్రదర్ చైతుకు రేపు 'వెంకీమామ' రిలీజ్ సందర్భంగా అల్ ది బెస్ట్" అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే 'వెంకీమామ' ఈరోజే రిలీజ్ అయింది.  సినిమా యావరేజ్ అంటూ రివ్యూలు వచ్చాయి. అయితే వెంకీ-చైతుల కెమిస్ట్రీ మాత్రం భలే కుదిరిందనే ప్రశంసలు దక్కుతున్నాయి.  మరి దగ్గుబాటి మామ-అక్కినేని అల్లుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తారో వేచి చూడాలి.


Tags:    

Similar News