కొందరు నిర్మాతలు పోటీ ఉన్నా పర్వాలేదు పండగ సీజన్లో తమ సినిమాను తేవాలనుకుంటారు. ఇంకొందరు సీజన్ ఎలాంటిదైనా పర్వాలేదు.. సోలోగా తమ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటారు. అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ విషయంలో రెండో రకంగానే ఆలోచించారు. ఓ దశలో ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నా.. ఇలాంటి భక్తరస చిత్రాన్ని అంత పోటీ మధ్య రిలీజ్ చేయడం మంచిది కాదని వాయిదా వేసుకున్నారు. తర్వాతి రెండు మూడు వారాల్లోనూ డేట్లు అందుబాటులో ఉన్నా.. అన్ని రకాలుగా ఆలోచించుకుని.. సోలోగా ఫిబ్రవరి 10న రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యారు. జనవరి 26వ తేదీని కూడా సీరియస్ గా పరిశీలించినా.. ఆ తేదీకి గురు.. సింగం-3 సినిమాలు షెడ్యూల్ కావడంతో ఫిబ్రవరి 10కి ఫిక్సయ్యారు. కొంచెం ముందుగానే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు.
ఐతే అంతా సవ్యంగా సాగుతుండగా.. సూర్య సినిమా ‘సింగం-3’ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం ‘ఓం నమో వెంకటేశాయ’ టీంకు మింగుడుపడటం లేదు. మరోవైపు ‘గురు’ కూడా వాయిదా పడింది. ఈ రెండు సినిమాల సంగతి ముందే తెలిస్తే జనవరి 26న ‘ఓం నమో వెంకటేశాయ’ను రిలీజ్ చేసేసేవాళ్లు. కానీ క్లారిటీ వచ్చేసరికి ఆలస్యమైంది. ఇప్పటికిప్పుడు సినిమాను ముందుకు జరపడానికి కూడా కుదర్లేదు. అసలే అన్ సీజన్.. పైగా ‘సింగం-3’ లాంటి మాస్ సినిమాతో పోటీ పడటం నాగ్ మూవీకి కచ్చితంగా ఇబ్బందికరమే. భక్తి చిత్రాలకు ప్రేక్షకులు విరగబడిపోరు. కాబట్టి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేయడం కీలకం. కానీ సింగం-3తో పోటీ పడాల్సి వస్తోంది. మాస్ ప్రేక్షకుల ఓటు ఆ సినిమాకే ఉంటుందనడంలో సందేహం లేదు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్లో భక్తి సినిమా అంటే మంచి అంచనాలుండటంతో ‘ఓం నమో వెంకటేశాయ’కు బిజినెస్ బాగానే జరిగింది. ఐతే ఇప్పుడు అన్ సీజన్లో.. పోటీ మధ్య రిలీజవుతుండటంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని.. పెట్టుబడి రికవర్ కావడం కష్టమని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలపై నాగార్జున కూడా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. సూర్యతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నాడట. ఐతే ఆయన రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం లేకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ‘సింగం-3’ని ఇంకోసారి వాయిదా వేసే పరిస్థితి లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/