మ‌రో కొత్త ద‌ర్శ‌కుడ్ని ప‌రిచ‌యం చేస్తున్న నాగశౌర్య‌

Update: 2022-08-22 08:33 GMT
యంగ్ హీరో నాగ‌శౌర్య టాలీవుడ్ బిజీ న‌టుల్లో ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా ప‌లు చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. 'ప‌లానా అబ్బాయి..ప‌లానా అమ్మాయి'.. 'నారీ నారీ న‌డుమ మురారీ'..'పోలీస్ వారి హెచ్చ‌రిక' చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో  కొత్త చిత్రాన్ని నేడు ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పైసుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ప్రొడక్షన్‌ ఆఫీస్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి..  స్క్రిప్ట్‌ను అందజేశారు. 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.

ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో  నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది.  సినిమాపై యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్  గా  నిలుస్తుంద‌ని.. అన్ని వ‌ర్గాలు మెచ్చే అంశాలు సినిమాలో ఉన్నాయ‌ని తెలిపారు. ఈ చిత్రానికి  'లవ్ స్టోరీ' కి సంగీతం అందించిన పవన్ సీ.హెచ్  సంగీతం అందిస్తున్నారు.

ఇక నాగ‌శౌర్య‌ స‌రైన స‌క్సెస్ అందుకుని చాలా కాల‌మ‌వుతుంది. కొన్ని డిఫ‌రెంట్ అటెంప్స్ట్ చేసిన‌ప్ప‌టికీ అవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. 'ఛ‌లో' త‌ర్వాత చాలా సినిమాలు చేసాడు. కానీ అవేవి యంగ్ హీరో అనుకున్న రేంజ్ లో విజ‌యం  సాధించ‌లేదు. 'క‌ణం'..'అమ్మ‌మ్మ‌గారిల్లు'..'న‌ర్త‌న‌శాల‌'..'అశ్వ‌థామ‌'..'వ‌రుడు కావ‌లెను'..' ల‌క్ష్య‌'..'కృష్ణ  వ్రింద విహారీ ' లాంటి చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇలా  కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌కరించినా యంగ్ హీరో సంక‌ల్పం మాత్రం చెదిరిపోలేదు. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు.  ఏ ద‌శ‌లోనూ ఖాళీగా లేడు. వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూ న‌టుడిగా త‌న‌ను తాను నిరూపించుకుంటున్నాడు.

ఈ క్ర‌మంలో కొన్ని డిఫ‌రెంట్ అటెంప్స్ట్ చేసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు.  ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న సినిమాల‌పై  చాలా ఆశ‌లు పెట్ట‌కున్నాడు. వాటితో స‌క్సెస్ అందుకుని  మ‌ళ్లీ ఫామ్ లో కి రావాల‌ని ఆశిస్తున్నాడు.
Tags:    

Similar News