అరవోళ్లకు హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటే భలే ఇష్టం. ఐతే ఆ అరవోళ్లు కూడా తట్టుకోలేనంత బరువు పెరిగిపోయింది నమిత. మూడేళ్ల కిందటే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు రెండేళ్లుగా ఆమె అడ్రస్ లేదు. అలాంటిది ఉన్నట్లుండి సన్నబడి మీడియా ముందు ప్రత్యక్షమైంది నమిత. మళ్లీ సినిమాలు చేస్తానని.. రాజకీయాల్లోకి కూడా అడుగుపెడతానని.. బరువు తగ్గాక తన తొలి ప్రెస్ మీట్ లో చెప్పిన నమిత.. ఆ తర్వాత కూడా మీడియా వాళ్లతో టచ్ లోకి వచ్చింది. ఒకప్పుడు బరువు గురించి పెద్దగా పట్టించుకోలేదని.. ఐతే బరువు మరీ హద్దులు దాటిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డానని.. లావుగా ఉండే అందరమ్మాయిల్లాగే తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యానని చెప్పింది.
"ఒబేసిటీ వల్ల చాలా బాధపడ్డాను. నాకు ఉన్నట్లుండి అవకాశాలు దూరమయ్యాయి. అందరూ పట్టించుకోవడం మానేశారు. దీంతో బరువు తగ్గాల్సిందే అని నిర్ణయించుకున్నా. ఐతే అందుకోసం చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి పట్టుబట్టి ప్రయత్నించాను. చాలా కష్టపడ్డాను. 90 కిలోలు ఉన్నదాన్ని 18 కిలోలు తగ్గాను. ఐతే నేను ఒక్కసారిగా బరువు తగ్గలేదు. ఓ నిర్మాత సూచన మేరకు ఓ ఒబెసిటీ క్లినిక్ లో చేరాను. నెమ్మది నెమ్మదిగా భారం దించుకున్నా. ముందు కిలోన్నర తగ్గాను. అప్పుడు నమ్మకం కలిగింది. రెగ్యులర్ ట్రైనింగ్, డైట్ వల్ల బరువు తగ్గి స్లిమ్ గా తయారయ్యాను. అందరూ మళ్లీ నటిస్తావా అని అడుగుతున్నారు. నటించడానికే కదా ఇలా తయారైంది. ప్రస్తుతం కథలు వింటున్నా. త్వరలోనే కొత్త సినిమాలు వెల్లడిస్తా. యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది" అని నమిత చెప్పింది.