నన్ను ఐటెం అన్న వెదవ వీడే: నమిత

Update: 2020-03-17 20:30 GMT
'నా మౌనాన్ని బలహీనత అనుకుని తక్కువ అంచనా వేయకండి' అంటుంది హాట్ బ్యూటీ నమిత. ఈ మధ్యే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది. ఒకప్పుడు తన హాట్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీని కుదిపేసిన నమిత ఇటీవలే తనను ఆన్లైన్ లో వేధిస్తున్న వ్యక్తి వివరాలు బయటపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. సెంతమిళ స్మిత్ అనే యువకుడు తనతో ఇంస్టాగ్రాంలో పరిచయమై చాట్ చేసాడని, తనను 'ఐటెం' అని పిలిచినట్లు తెలిపింది.

తర్వాత అతను నమిత నటించిన కొన్ని పోర్న్ వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. నా జీవిత వాస్తవాలేమిటో నాకు తెలుసు.. నువ్వు పోస్ట్ చేసుకొమ్మని అతనికి చెప్పింది. అనంతరం ఆ యువకుని ఫోటోను సోషల్ మీడియాతో షేర్ చేసి ఇలా చెప్పుకొచ్చింది నమిత.

"ఇదిగో ఇదే ఆ నీచుని ఫోటో. తుచ్యమైన ఆలోచనలు కలిగిన వరస్ట్ పర్సన్ వీడు. ఎవరినైనా ఏ ఆడ పిల్లనైనా చెత్త వ్యాఖ్యలతో పిలవచ్చెనే హక్కు ఉందనుకొని విర్రవీగుతున్నాడు. అలంటి వాడిని నేను సహించబోనని, నిజంగా వాడు మనిషైతే ఆడవారిని ఎలా గౌరవించాలో తెలిసి ఉంటుందని చెప్పింది. ఇతర స్త్రీలను అగౌరవ పరిస్తే సొంత తల్లిని అగౌరవ పరుచుకున్నట్లే. ఇలాంటి వాళ్లకు ఏడాదికి ఒకసారి దుర్గాపూజలు, మహిళా దినోత్సవాలు జరపడం ఆపేసి మహిళలను గౌరవించడం నేర్పించాలి" అంటూ తనకు జరిగిన సంఘటన గురించి వెల్లడించింది నమిత. ఈ పోస్ట్ చూసిన కొందరు నమితకు సపోర్ట్ చేయడంతో పాటు నమిత ఇంగ్లీష్ స్కిల్స్ ని పొగడటం విశేషం.
Tags:    

Similar News