కృష్ణతో మహేష్ కి పోలిక.. కరెక్టేనా?

Update: 2018-04-05 05:52 GMT
మహేష్ బాబు కొత్త సినిమా భరత్ అనే నేను మరో రెండు వారాల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రచార హంగామా పీక్స్ లో ఉండగా.. మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం సినిమా నుంచి వచ్చాడయ్యా సామీ అంటే సాగే లిరికల్ సాంగ్ కూడా విడుల కానుంది.

ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ను.. పోస్ట్ చేసిన మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్.. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తెల్లని పంచె కట్టులో ఉన్న లుక్ తో పోల్చింది. ఇంతకంటే ఇంకేమైనా చెప్పాలా అని కామెంట్ కూడా చేసింది. పక్కపక్కనే తండ్రీకొడుకుల పోస్టర్లు చూస్తే బాగానే ఉంది. కానీ అప్పట్లో తనతో సినిమాతీసి ఫ్లాపు కొట్టి నష్టపోతే.. కృష్ణ గారు వాళ్ళకి ఫ్రీగా సినిమాలు చేసేవారట. అంతే కాదు.. తన దగ్గరకు ఎవరైనా వచ్చి అయ్యా ఇదీ సమస్య అని చెప్పుకుంటే.. డేట్స్ ఇచ్చేసేవారట. సినిమా కంప్లీట్ చేసి మార్కెట్ చేసి.. రిలీజ్ అయ్యాక అపుడు ఇచ్చినంత తీసుకునేవారని సినీ జనాలు అంటారు.

మరి ఇలాంటివి మహేష్ బాబు చేస్తాడా అని అడిగితే? మహేష్‌ బాబు బ్రహ్మోత్సవం స్పైడర్ సినిమాలు తీసినోళ్ళకు ఇంకో మూవీ ఫ్రీగా చేస్తాడా? ఫోటోలను చూపించి ఆ పాత మధురాలను.. జ్ఞాపకాలను రిపీట్ చేస్తున్నాం అని గర్వంగా చెప్పుకున్నప్పుడు.. ఇది కూడా చెప్పాలిగా.. ఏమంటారు శ్రీమతి ఘట్టమనేని నమ్రత మహేష్ గారూ!
Tags:    

Similar News