ఈమద్య కాలంలో ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ సంస్థలు చాలా ఎక్కువ అయ్యాయి. ఇండియాలోనే అతి పెద్ద ఫుడ్ డెలవరీ ఆన్ లైన్ పోర్టల్ అయిన జొమాటో డెలవరీ బాయ్ చేసిన నిర్వాకంతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలంటేనే భయం వేస్తోంది. ఆర్డర్ వచ్చిన ఫుడ్ ను ఒక డెలవరీ డెలవరీ ఇచ్చేందుకు తీసుకు వెళ్తూ మద్యలో ప్యాక్ ఓపెన్ చేసి కాస్త తింటూ ఉండటం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఫుడ్ ను డెలవరీ బాయ్ ఓపెన్ చేసి తినడంతో జొమాటోపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జొమాటో పై ఆగ్రహావేశాలతో విమర్శలు చేస్తున్నారు.
తాజాగా జొమాటో డెలవరీ బాయ్ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కూడా షేర్ చేసింది. ఈ సంఘటనపై ఆమె చాలా సీరియస్ అయ్యింది. పేరున్న సంస్థ అంటూ ప్రచారం చేసుకునే వారు కనీసం శుభ్రత, జాగ్రత్త పాటించకుండానే డెలవరీ చేయడం షాకింగ్ గా అనిపించింది. ఈ వీడియోను చూసిన తర్వాత ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం అంటేనే భయం వేస్తోంది. నా పిల్లలకు ఆన్ లైన్ లో ఫుడ్ అస్సలు ఆర్డర్ చేయనివ్వను, మీరు కూడా ఆన్ లైన్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది అనేది నా సలహా అంటూ సోషల్ మీడియాలో నమ్రత షేర్ చేసింది.
ఈ సంఘటనపై జొమాటో సీరియస్ అయ్యింది. డెలవరీ సమయంలో ప్యాకెట్ ఓపెన్ చేసిన వ్యక్తిని ఉద్యోగం నుండి తీసేయడంతో పాటు అతడిపై కేసు కూడా పెట్టినట్లుగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నాడు. తమిళనాడులోని మధురలో ఈ సంఘటన జరిగింది. దేశ వ్యాప్తంగా ఈమద్య కాలంలో జొమాటో భారీగా ఆర్డర్లు దక్కించుకుంటుంది. ఈ సంఘటనతో ఒక్కసారిగా సంస్థ పరువు పోయినట్లయ్యింది.
వీడియో కోసం క్లిక్ చేయండి