హిందీ 'స్పైడర్' పై న‌మ్ర‌త ఆస‌క్తి!

Update: 2017-06-16 12:17 GMT
ప్రిన్స్ మ‌హేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్ అప్‌ క‌మింగ్ మూవీ  'స్పైడర్' కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో పిచ్చ‌ క్రేజ్‌ వుంది.  ఇదే క్రేజ్‌ను బాలీవుడ్ లో కూడా సొంతం చేసుకోవాల‌ని స్పైడర్ చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌. అందుకోసం నమ్రత మహేష్‌ రంగంలోకి దిగినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

 'స్పైడర్' చిత్రానికి నైజాంలో 26 కోట్లు - సీడెడ్‌ లో 15 కోట్లు బిజినెస్‌ జరిగింది. ఆంధ్ర ప్రాంతంలోను మహేష్ గ‌త సినిమాల క‌న్నా ఈ చిత్రం ఎక్కువ రేటు ప‌లుకుతోంది. తమిళంలో ఈ చిత్రాన్ని 18 కోట్లకి  తీసుకున్నార‌ని ట్రేడ్‌ వర్గాల అంచ‌నా.  హిందీ వెర్షన్‌ ఒక్కటే ఇంకా సేల్ కాలేదు. డైరెక్ట‌ర్ మురుగదాస్‌ కి బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. కానీ, 'స్పైడర్' పై బాలీవుడ్‌ సర్కిల్స్‌ లో ఆసక్తి లేదు. కరణ్‌ జోహార్ ప్ర‌చారంతో బాహుబలికి మీడియాలో మంచి కవరేజ్ వ‌చ్చింది.

బాహుబ‌లి స్థాయిలో కాకపోయినా, స్పైడర్ ని మీడియా కవర్‌ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావ‌న‌. అందుకే, స్పైడర్‌ హిందీ వెర్షన్‌ కోసం ఏదో ఒక బాలీవుడ్‌ నిర్మాణ సంస్థతో ఒప్పందానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

నమ్రతకి బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా ప‌రిచ‌యాలు ఉన్నాయి. దీంతో, స్పైడర్‌ కి బాలీవుడ్‌ సపోర్ట్ దొరికే చాన్స్ ఉంద‌ని భావిస్తున్నారు. ఈ చిత్రంపై ఉత్కంఠ రేపేలాగా మురుగదాస్‌ ఒక మైండ్ బ్లోయింగ్ టీజర్‌ ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News