మహేష్ వాటి జోలికి వెళ్ళడు

Update: 2019-02-10 04:51 GMT
సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వెళ్ళడం సర్వ సాధారణం . ఎన్టీఆర్-ఏంజిఆర్-జయలలితలు కేవలం తమ చరిష్మా ఆధారంగానే రాష్ట్రాలను ఏలే స్థాయికి చేరుకున్నారు. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే విషయం కాదు. వీళ్ళతో సమానంగా పరిగణింపబడిన చిరంజీవి చాలా తక్కువ సమయంలోనే ప్రజారాజ్యాన్ని అంతర్ధానం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు జనసేనను నిలబెట్టేందుకు సినిమాలను వదిలేసి మరీ పవన్ చేస్తున్న ప్రయత్నాలు జనం చూస్తూనే ఉన్నారు.

ఈ నేపద్యంలో టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత శక్తివంతమైన మార్కెట్ కలిగిన మహేష్ బాబు పాలిటిక్స్ లోకి వస్తాడా రాడా అనే సందేహం కలగడం సహజం. పైగా ఏరికోరి భరత్ అనే నేనులో ప్రిన్స్ సిఏంగా నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. యువతరం ప్రతినిధిగా మహేష్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. అందుకే నిజ జీవితంలో అలాంటి దృశ్యాన్ని చూడాలని ఫ్యాన్స్ కోరుకోవడం తప్పేమీ కాదుగా. అయితే మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ వాటి మీద పూర్తిగా నీళ్ళు చల్లేస్తున్నారు. ఈ రోజు తమ 14వ పెళ్లి రోజు సందర్భంగా దీని గురించి పూర్తి క్లారిటీ ఇచ్చేసారు.

మహేష్ కు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని అన్ని వార్తలను కొట్టి పారేసింది. ప్రిన్స్ ప్రేమించేది సినిమాలనే ఆయనకు అది తప్ప ఇంకేది తెలియదని తెరమీద చూస్తే చాలని దండం పెట్టడం విశేషం. మహేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యక్తిగతంగా ఆసక్తి లేకపోవడంతో పాటు నాన్న సూపర్ స్టార్ కృష్ణ గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం కూడా కావొచ్చు. ఏదైతేనెం రియల్ టైం సిఎంగా మహేష్ చూడాలని ఇంకా ఎవరికైనా ఉంటే ఆ ఆలోచన మానుకోవడం ఉత్తమం


Tags:    

Similar News