ప్రభుత్వ స్థలాన్ని బాలయ్య కబ్జా చేశారా? ఆ సోషల్ యాక్టివిస్టు వాదన ఏమంటే?

Update: 2022-10-09 04:11 GMT
ప్రముఖ నటుడు నందమూరి బాలక్రిష్ణకు సంబంధించి ఒక సంచలన అంశాన్ని సోషల్ మీడియా సాక్షిగా ఆరోపిస్తున్నారు సోషల్ యాక్టివిస్టు విజయ్ గోపాల్. జూబ్లీహిల్స్ లోని తన నివాసాన్ని ఆనుకొని ఉన్న సర్కారు స్థలాన్ని బాలయ్య అక్రమంగా ఆక్రమించుకున్నారని.. అయితే.. ఆ విషయాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ.. ప్రభుత్వం కానీ పట్టించుకోవటం లేదన్నది తాజా ఆరోపణ. ఇంతకీ ఈ ఆరోపణ చేసిన విజయ గోపాల్ ఎవరు? అతడు చేస్తున్న ఆరోపణ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

జూబ్లీహిల్స్ లోని ప్రధాన రోడ్డు వెంబడి ఉంటుంది నందమూరి బాలక్రిష్ణ నివాసం. ప్రధాన రహదారికి అనుకొని ఉండే ఆయన నివాసం నిత్యం వాహనాలతో హడావుడిగా ఉంటుంది. పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో పెద్దగా ట్రాఫిక్ హడావుడి లేనప్పటికీ.. ఇటీవల కాలంలో మాత్రం బాగా పెరిగిన పరిస్థితి. తాజాగా వచ్చిన ఆరోపణ ఏమంటే.. ప్రభుత్వానికి చెందిన పేవ్ మెంట్ ను బాలయ్య ఆక్రమించుకున్నారని చెబుతున్నారు.

ఇక.. విజయ గోపాల్ విషయానికి వస్తే.. గతంలో బుక్ మై షో.. పేటీఎం లాంటి సంస్థలు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ న్యాయపోరాటం చేసి.. తనకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా రాబట్టిన ఆయన.. తాజాగా బాలయ్య ఇంటి పేవ్ మెంట్ సర్కారు స్థలమని.. దాన్ని దర్జాగా ఆక్రమించుకున్నట్లుగా పేర్కొంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు.. జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కు.. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ లాంటి వారికి కూడా ట్యాగ్ చేశారు.

'సాధారణ ప్రజలు కూడా సెలబ్రిటీలు అయితే వాళ్లు ఏం చేసినా మీరు ఇలాగే సైలెంట్ గా ఉంటారా?' అంటూ ప్రశ్నించిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పనిలో పనిగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి.. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లో ట్యాగ్ చేసిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. మరి.. ఈ ట్వీట్ కు అధికారులు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

https://twitter.com/VijayGopal_/status/1578715475810615298?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1578715475810615298|twgr^e12d2ba9cadc687fea0f2b5788bbe936c8bcf28d|twcon^s1_&ref_url=https://zeenews.india.com/telugu/entertainment/nandamuri-balakrishna-house-in-jubilee-hills-encroached-the-pavement-alleges-vijay-gopal-78770
Tags:    

Similar News