బాల‌య్య 107 టైటిల్ తేలేది అప్పుడేన‌ట‌గా!

Update: 2022-10-16 06:54 GMT
నంద‌మ‌యూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ `అఖండ‌`తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న బాల‌య్య త‌న త‌దుప‌రి మూవీ విష‌యంలోనూ అదే జోరుని కొన‌సాగిస్తున్నారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాల‌య్య‌ క్రేజీ ప్రాజెక్ట్ NBK 107లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.  అత్యంత భారీ స్‌థాయిలో హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా  మూవీని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఇందులో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌న్న‌డ స్టార్‌ దునియా విజ‌య్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, మ‌ల‌యాళ న‌టి హ‌నీ రోజ్‌, చంద్రిక ర‌వి, లాల్‌ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్  సిటీలో జ‌రుగుతోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ ల‌తో ఈ మూవీపై భారీ బ‌జ్ క్రియేట్ అయింది. అందుకు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో సినిమా టైటిల్ వుండాల‌ని గ‌త కొన్ని రోజులుగా చిత్ర బృందం భారీ క‌స‌ర‌త్తులు చేస్తోంది.

ఈ మూవీకి `జై బాల‌య్య‌`, రెడ్డిగారు వంటి ప‌లు టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే బాల‌య్య మాత్రం ఈ రెండు టైటిల్స్ ని రిజెక్ట్ చేశార‌ట‌. ఇదిలా వుంటే మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నంద‌మూరి బాల‌య్య అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పేశారు. ఈ మూవీ టైటిల్ ని ఈ నెల 21న ప్ర‌క‌టించ‌బోతున్నామంటూ చిత్ర బృందం ఆదివారం ప్ర‌క‌టించింది. ఇంత‌కీ చిత్ర బృందం ఏ టైటిల్ ని బాల‌య్య కోసం ఫైన‌ల్ చేసింది? .. ఫ్యాన్స్ ఖుషీ అవుతారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

టైటిల్ రివీల్ చేయ‌డానికి స‌రిగ్గా ఐదు రోజులు మాత్ర‌మే వుండ‌టంతో బాల‌య్య ఫ్యాన్స్ లో సోష‌ల్ మీడియా వేదిక‌గా హంగామా చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ మూవీలో నంద‌మూరి బాల‌కృష్ణ టూ షేడ్స్ వున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. వ‌య‌సు మ‌ళ్లిన పాత్ర‌కు సంబంధించిన లుక్ ఇప్ప‌టికే టీజ‌ర్ లో రివీల్ కాగా యంగ్ క్యారెక్ట‌ర్ కు సంబంధించిన లీక్డ్ పిక్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈమూవీకి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News