`అఖండ`తో నందమూరి బాలకృష్ణ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న బాలయ్య తన తదుపరి మూవీ ని కూడా అదే స్థాయికి ఏ మాత్రం మించకుండా చేస్తున్న విషయం తెలిసిందే. NBK 107 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీపై బాలయ్యతో పాటు నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అత్యంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ని ఈ నెల 21న మేకర్స్ ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం రెండు టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. రెడ్డిగారు, జై బాలయ్య.. ఈ రెండింటిని కూడా బాయ్య రిజెక్ట్ చేశారట. అయితే 21న మేకర్స్ ఏ టైటిల్ ని ఖరారు చేస్తారా? అని అంతా ఆరా తీస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో కన్నడ స్టార్ దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటి హనీ రోజ్, చంద్రిక రవి, లాల్ నటిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ చివకరి దశకు చేరిన ఈ మూవీని ముందు డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే బాలయ్య మాత్రం సంక్రాంతి బరిలో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారని కూడా ప్రచారం మొదలైంది. కానీ మేకర్స్ మాత్రం ఈ మూవీ రిలీజ్ అప్ డేట్ ని మాత్రం చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తుండటం అనుమానాల్ని రేకెత్తిస్తోంది.
సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మెగాస్టార్ 154 వ మూవీ రిలీజ్ కాబోతోంది. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంక్రాంతి రిలీజ్ చేస్తున్నామంటూ ఇప్పటికే ప్రకటించేశారు. ఇదే టైమ్ లో బాలకృష్ణ సినిమా కూడా బరిలోకి దిగేతే చూడాలని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో తమ సినిమాలని పోటీకి దింపుకునే వీలు లేదు. ఆ కారణంగానే బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ని మైత్రీ వారు ప్రకటించడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.