ఎన్టీఆర్ పాత్రలో మరోసారి నటించనని చెప్పేసిన బాలయ్య..?

Update: 2020-04-01 08:30 GMT
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన దివంగత ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలలో తన తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహనాయకుడు పేర్లతో రూపొందించిన ఈ రెండు భాగాలు పరాజయాన్ని చవి చూశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి 'తలైవి' చిత్రంలో తండ్రి ఎన్టీఆర్ రోల్ కోసం బాలకృష్ణను సంప్రదించారట. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆయన సుముఖత చూపలేదని తెలుస్తోంది. తనను సంప్రదించిన దర్శకనిర్మాతలకు కారణాలేవీ చెప్పకుండా సున్నితంగా నో చెప్పేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతోంది. 'తలైవి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ కీలకపాత్ర పోషిస్తుండగా, అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు పెట్టారట. అప్పట్లో జయలలితతో కలిసి ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో నటించారు. ఆ కారణంగా ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రను కూడా ఉంచారట. అయితే ఆ పాత్రకు బాలకృష్ణ అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతారని భావించిన నిర్మాతలు ఆయన్ను సంప్రదిస్తే నో అనే సమాధానం వచ్చిందని తెలుస్తోంది. దీంతో 'తలైవి' సినిమాలో ఎన్టీఆర్ పాత్ర లేకుండానే చిత్రీకరిస్తున్నారని సమాచారం.
Tags:    

Similar News