నందమూరి వంశవృక్షం..ఎంతమందో తెలిస్తే షాక్!

Update: 2020-05-12 03:36 GMT
నందమూరి తారక రామారావు.. తెలుగు జాతికే వన్నెతెచ్చిన మహావ్యక్తి. తెలుగు సినీ కళామతల్లికి పుట్టిన తొలి బడ్డగా అందరూ కీర్తిస్తుంటారు. తెలుగు సినిమా చరిత్ర తీస్తే మొదట గుర్తుకు వచ్చేది నందమూరి తారకరామారావే.. ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబు లు తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలాంటి వారు..

నందమూరి తారక రామారావు.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ‘అన్నగారి’గా ఆంధ్రుల హృదయాల్లో ఒదిగిపోయారు. ఇలా సినీ - రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ వంశవృక్షం చాలా పెద్దది. తాజాగా ఎన్టీఆర్ తండ్రి - తాత నుంచి ఆయన కుమారుల వరకు పెద్ద ఫ్యామిలీ చరిత్ర బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

* నందమూరి తారక రామారావు వంశవృక్షాన్ని ఒక్కసారి పరికించి చూస్తే..

నందమూరి పెద రామస్వామికి నందమూరి రామయ్య - నందమూరి లక్ష్మయ్య చౌదరి అనే ఇద్దరు కొడుకులు. ఇందులో నందమూరి లక్ష్మయ్య చౌదరి మన ఎన్టీఆర్ తండ్రి. కాగా పెద రామస్వామి స్వయానా తాత అవుతాడు.

ఎన్టీఆర్ తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరికి ఇద్దరు సంతానం.. అందులో ఎన్టీఆర్ పెద్ద వాడు కాగా.. ఆయన తరువాత నందమూరి త్రివిక్రమరావు. ఎన్టీఆర్ కు త్రివిక్రమ రావు సోదరుడు.

ఇక ఎన్టీఆర్ కు ఏడుగురు కుమారులు - నలుగురు కూతుళ్లు. నందమూరి జయకృష్ణ - సాయికృష్ణ  - హరికృష్ణ - బాలక్రిష్ణ - మోహనకృష్ణ - రామకృష్ణ - జయశంకరకృష్ణ లు ఎన్టీఆర్ కు వరుసగా పుట్టిన కొడుకులు. ఇక మధ్యలో లోకేశ్వరి - పురంధేశ్వరి - భువనేశ్వరి - ఉమమహేశ్వరీ కూతుళ్లు. కొడుకులు - కోడళ్లు - కూతుళ్లు - అల్లుల్లు.. వారి మనవళ్లతో ఎన్టీఆర్ ఫ్యామిలీ చాలా పెద్దది అని చెప్పవచ్చు..

ఇక మనకు తెలిసిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాన్ రామ్ లు హరికృష్ణ కుమారులు.  ఇక మిగతా వారి సంతానం కూడా పెద్ద సంఖ్యలో ఉంది. తారకరత్న - జయకృష్ణ సహా కొందరు తెరపై అప్పుడప్పుడు తళకున్న మెరిసారు.

ఇక మన బాలయ్య బాబుకు ఇద్దరు సంతానం.. మోక్షజ్ఞతోపాటు బ్రాహ్మణి - మరో సోదరి కూడా ఉంది. మిగతా కుమారుల ఫ్యామిలీలు లో ప్రొఫైల్ ను మెయింటేన్ చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ ఫ్యామిలీనే 200 మంది వరకు ఉంటారని సమాచారం.

ఎన్టీఆర్ వంశవృక్షానికి సంబంధించిన ఈ అరుదైన ఫొటోను కింద చూడొచ్చు..
Tags:    

Similar News