టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ అన్ని మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే వేరే దర్శకులతో సినిమాల రిజల్ట్స్ తారుమారు అవుతున్నాయని.. ఇదివరకు బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుల వైపే మొగ్గు చూపుతున్నారు హీరోలు. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. అదే నటసింహం నందమూరి బాలయ్య - బోయపాటి శీను కాంబోలో తెరకెక్కుతున్న 'బిబి3'. ఈ సినిమాతో బాలయ్య బోయపాటి ఇద్దరూ మూడోసారి కలిసి వర్క్ చేస్తున్నారు. ఇదివరకు వీరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు ఓ రేంజిలో బాక్సాఫీస్ షేక్ చేసాయి. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ హిట్టు కొడతామనే నమ్మకంతో వస్తుండటంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.
నిజానికి బాలయ్యను ఇదివరకు కూడా చాలామంది దర్శకులు పవర్ ఫుల్ గా చూపించారు. కానీ వారందరిలో బోయపాటి మేకింగ్ వేరు. బాలయ్యతో ఈరోజుల్లో ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా తీయగలిగేది బోయపాటి మాత్రమే అనే అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 28న రిలీజ్ చేస్తామని ఇదివరకు ప్రకటించిన మేకర్స్.. ఇప్పటివరకు సినిమా పేరును కూడా అనౌన్స్ చేయలేదు. అలాగే అసలే కరోనా టైం నడుస్తుంది. ఓవైపు అన్ని సినిమాలు ఏదొక అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. కానీ రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత బోయపాటి నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి అసలు సినిమా ఎంతవరకు వచ్చింది.. ఏంటని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బిబి3 నుండి అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.