సంతాపం ట్వీట్ - ట్రోలింగ్ కు గురైన సమంతా

Update: 2018-08-29 10:43 GMT
తెలుగుదేశం పార్టీ నేత -సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఈరోజు పొద్దున రోడ్ యాక్సిడెంట్ లో దురదృష్టకరంగా తనువు చాలించడం తెలుగువారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.  సాధారణ ప్రజలతో పాటు పలువురు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు - రాజకీయ నాయకులు నందమూరి కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. చాలామంది లాగే హీరోయిన్ సమంతా కూడా ట్విట్టర్ ద్వారా తన సంతాపం తెలిపింది. కానీ నెటిజనుల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది.

సమంతా ఇలా ట్వీట్ చేసింది "# RIP హరికృష్ణ.  ఈ వార్తతో షాక్ కు గురయ్యాను. ఎంతో బాధగా ఉంది.  ఇలాంటి కష్టకాలంలో అయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను."  కానీ హరికృష్ణ గారు అని సంబోధించక పోవడంతో ఆగ్రహానికి గురైన నెటిజనులు "అసలు నువ్వు ముందు పెద్దవారిని గౌరవించడం నేర్చుకో" అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  నెటిజనుల వద్ద నుండి హీట్ తగలడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేసి మరో ట్వీట్ లో 'రిప్ హరికృష్ణ గారు అంటూ' తన పొరపాటును సరిదిద్దుకుంది.

తప్పును దిద్దుకుంది కానీ నెటిజనుల - నందమూరి అభిమానుల ఆగ్రహం వెంటనే చల్లారదు కదా. సమంతా మొదటిసారి పోస్ట్ చేసి డిలీట్ చేసిన ట్వీట్.. రెండో సారి చేసిన ట్వీట్ ల స్క్రీన్ షాట్ లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Tags:    

Similar News