హ్యాపీ బర్త్ డే నానా!!

Update: 2017-05-20 05:03 GMT
సాధారణంగా తెలుగు సినిమా తెర మీద చూపించే కొన్ని రిలేషన్లు..నిజ జీవితంలో చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకే తండ్రికి.. వేర్వేరు తల్లులకి పుట్టిన అన్నదమ్ములను మనోళ్ళు తరతరాలుగా విరోధి ఫ్యామిలీలుగానే చూపిస్తున్నారు. కాని నిజ జీవితంలో ఇలాంటి అన్నదమ్ములు ఎంతటి ఆప్యాయంగా ఉంటారనేది మాత్రం.. మనం టాలీవుడ్ లో చూడాలి.

ఆల్రెడీ నాగార్జున మొదటి భార్య కొడుకు నాగ చైతన్య అండ్ అమల కొడుకు అఖిల్ మధ్య బంధం మనకు తెలిసిందే. ఈ అన్నదమ్ములు టాలీవుడ్ లో ఎంతోమంది బ్రదర్స్ అంటే ఇలా ఉండాలి అని ప్రూవ్ చేస్తున్నారు. ఇకపోతే వీరి తరహాగానే మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారే జూ.ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్. తల్లులు వేరు కాని ఇద్దరూ హరికృష్ణ కొడుకులే. ఇక జూనియర్ పై కళ్యాణ్‌ రామ్ ప్రేమ అనిర్వచనీయం. అదిగో బర్త్ డే సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే నానా' అంటూ ఫోటో పెట్టి ట్వీటేశాడు. ఆ మాటలో ఉచ్చరిస్తున్న ప్రేపపాళ్ల నుండి ఆ ఫోటోలో కనిపిస్తున్న లాలిత్యం వరకు.. అన్నీ మనకు ఎంతో నేర్పిస్తున్నాయి.

ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్ ప్రొడక్షన్లో ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాను చేస్తున్నాడు. ఆర్ధికంగా అన్నయ్యను నిలబెట్టడానికే ఈ సినిమా చేస్తున్నాడనే టాక్ ఉంది. ఏదేమైనా కూడా.. హ్యపీ బర్తడే ఎన్టీఆర్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News