నందమూరి వారసుడిగా బాలయ్య సినిమాల్లో ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. అందరి అంచనాలకు తగ్గట్లే.. ఆయన సినీ కెరీర్ సాగింది. అప్పుడప్పడు ఆయన స్టామినా మీదా.. మార్కెట్ మీదా అనుమానం వచ్చిన ప్రతిసారీ చెలరేగిపోవటం.. విమర్శకుల నోళ్లకు చెక్ చెప్పటం తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘అఖండ’తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరదను పారించిన బాలయ్య.. తన సత్తా ఏమిటన్న విషయాన్ని చాటారు.
విడుదలకు సినిమాలు సిద్ధంగా ఉన్నా.. కరోనా భయంతో ఎవరికి వారు వెనకడుగు వేస్తున్న వేళ.. వెనుకాముందు చూసుకోకుండా విడుదల చేసిన అఖండకు లభించిన ఆదరణ సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. యాభై రోజులకుదగ్గర పడుతున్నా.. నేటికి పలు థియేటర్లలో ఈ మూవీ నడుస్తోంది. ఈ విషయాల్ని పక్కన పెడితే.. బాలయ్య వారసుడు మోక్షజ్ణ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు.
నిజానికి మోక్షజ్ణను కొంతకాలం క్రితమే సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేస్తాడని భావించారు. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఆ మధ్యన బయటకువచ్చిన మోక్షజ్ణ ఫోటోలు షాకిచ్చేలా చేశాయి. భారీ సైజుతో ఉన్న అతగాడి రూపం.. బాలయ్య నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వటం సందేహమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ తర్వాత మళ్లీ బయటకు రాని మోక్షజ్ణ.. తాజాగా సంక్రాంతి పండగ వేళ.. ప్రకాశం జిల్లా కారంచేడులో తన మేనత్త పురంధేశ్వరి ఇంటికి వచ్చిన సందర్భంగా బయటకు వచ్చారు. ఆ మాటకు వస్తే.. తన కొడుకును పండుగ వేళ.. ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పాలి. గతంలో కనిపించిన రూపానికి భిన్నంగా..మోక్షజ్ణ ఉండటం గమనార్హం.
గతంతో పోలిస్తే.. బాగా సన్నబడినట్లుగా కనిపించారు. అయితే.. సిల్వర్ స్క్రీన్ మీద మెరవాలంటే మరింత కష్టపడాల్సిందే. మరికాస్త నాజుగ్గా మారక తప్పదు. అయితే.. ఈసారి తన తండ్రి బాలక్రిష్ణతో కలిసి ఉత్సాహంగా గడిపిన మోక్షజ్ణ.. గుర్రం స్వారీ చేయటం అందరిని ఆకర్షించేలా చేసింది. ఇంతకాలం ఏ వేడుకకు.. కార్యక్రమానికి మోక్షజ్ణను తీసుకురాకుండా ఉండే బాలయ్య.. ఈసారి సంక్రాంతి పండుగ వేళ.. తన కొడును బయటకు తీసుకురావటంతో అతన్ని చూసేందుకు కారంచేడుప్రజలు ఆసక్తిని ప్రదర్శించారు. మోక్షజ్ణకు సంబంధించిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.