నటసింహా నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఐదారేళ్లుగా నిరంతరం కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ అంతకంతకు ఆలస్యమవుతోంది. అయితే మోక్షు గురించి నందమూరి కాంపౌండ్ భారీ ప్రణాళికల్లో ఉండడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ నభూతోనభవిష్యతి అన్న చందంగా ఉండాలన్నది బాలకృష్ణ ప్లాన్. అందుకు తగ్గట్టే ఇప్పటికే కథను కూడా లాక్ చేసి టైటిల్ ని ఫిక్స్ చేసేశారు. అయితే ఈ మూవీ 2022లో నే ప్రారంభమయ్యేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది.
ఆదిత్య 369 సీక్వెల్ పనులు సాగుతున్నాయని ఇటీవల నందమూరి బాలకృష్ణ ధృవీకరించారు. నేడు ఆదిత్య 369 చిత్రం 30 వ వార్షికోత్సవం సందర్భంగా బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ``ఆదిత్య 369 ప్రధాన కథాంశం ఇప్పటికే లాక్ అయ్యింది. నేను ఇప్పుడు స్క్రిప్ట్ ను అభివృద్ధి చేస్తున్నాను. సీక్వెల్ పేరు ఆదిత్య 999 మాక్స్. ఇదే మోక్షజ్ఞ తొలి చిత్రం అవుతుంది`` అని బాలయ్య పేర్కొన్నారు. ఆదిత్య 999 మాక్స్ 2023లో మాత్రమే విడుదల కానుందని నందమూరి హీరో అన్నారు. అంటే మోక్షు సినిమా కోసం మరో రెండేళ్లు వేచి చూడాల్సి ఉంటుందన్నమాట.
ఈ ప్రాజెక్ట్ కి బాలకృష్ణ లేదా సింగీతం ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇంకా దర్శకుడిని ఎంపిక చేయలేదని బాలయ్య అనడం ఆసక్తికరం. ఆదిత్య 999 మాక్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుంది. 2022లో ప్రారంభం కానున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుది. ఇందులో మోక్షజ్ఞ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలకృష్ణ కూడా నటించనున్నారు.