స్టార్ హోదా వచ్చిన తర్వాత కోట్లకు కోట్లు ఆఫర్ చేసేస్తుంటారు. అలాంటిది ప్రయాణం మొదలైప్పుడు వేల రూపాయిలు ఇచ్చేందుకు సైతం ముప్పతిప్పలు పెడుతుంటారు. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. సినిమా రంగంలో మాత్రం ఛరిష్మాకు మించింది లేదు. ప్రేక్షకుల్లో గుర్తింపు.. మంచి పేరు వచ్చి.. క్రేజ్ వస్తే మొత్తంగా మారిపోతుంది. అలాంటిది దర్శకత్వం వహించిన మొదటి సినిమాకు డీసెంట్ అమౌంట్ పారితోషికంగా పొందటం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. అలాంటి లక్ నందినీ రెడ్డికి సొంతమైందని చెప్పాలి.
దాదాపు పదకొండేళ్ల క్రితం విడుదలైన ‘అలా మొదలైంది’ మూవీతో టాలీవుడ్ కు దర్శకురాలిగా పరిచయమయ్యారు నందినీ రెడ్డి. మొదటి సినిమాతో హిట్ దర్శకురాలిగా పేరు పొందిన ఆమె.. ఆ తర్వాత దర్శకత్వం వహించిన ఓ బేబీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి.. మొదటి సినిమాకు నందినీ రెడ్డికి లభించిన పారితోషికం ఎంత? అన్న లెక్కలోకి వెళితే.. ఆ విషయాన్ని తాజాగా ఆమె రివీల్ చేశారు.
ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అలా మొదలైంది సినిమాకు తనకు పారితోషికం కింద రూ.5లక్షలు ఇచ్చారన్నారు. అయితే.. సినిమా సూపర్ హిట్ అయి..తమిళంలో రీమేక్ అయిన వేళ మాత్రం మరోరూ.20 లక్షలు నిర్మాత ఇచ్చారన్నారు. అయితే.. ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు తాను పడిన కష్టం అంతా ఇంతా కాదన్నారు. ఒక దశలో సినిమా విడుదల అవుతుందా? అన్న సందేహం వచ్చేదని.. కానీ సినిమా విడుదలై సక్సెస్ అయ్యిందన్నారు.
సినిమా విడుదల విషయంలో తాను పడిన కష్టాన్ని చెప్పుకొచ్చారు నందినీ రెడ్డి. ‘‘నా సినిమాకోసం ఫైట్ చేశాను. వెనక్కి తగ్గలేదు. ఒకదశలో ఈ సినిమా చేయలేను అనుకున్నా. ఆపేద్దామనుకున్నా. ఆ సమయంలో శాటిలైట్ మార్కెట్ బావుంది. మా సినిమాకు ఒకటిన్నర కోటిదాకా శాటిలైట్ ఆఫర్ వచ్చింది. మా బడ్జెట్ రెండున్నరకోట్లు. దాదాపు కోటి నష్టపోవటం ఖాయం. అయితే.. మా నిర్మాతకు వివేక్‌గారు ఏమి చెప్పారంటే.. ‘మీరు సినిమా ఆపినా కోటిరూపాయలు నష్టపోతారు. చేసేద్దాం సినిమా. ఓ డైరక్టర్ కంటిన్యూ అవుతుంది’ అన్నారు. దీంతో ప్రొడ్యూసర్ దాము గారు సరేనన్నారు. ఆయన అప్పట్లో హ్యాపీ హ్యాపీగా అనే మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా రష్ బాగా వస్తుందని అనేవారు. మా సినిమా రష్ చూసేవారు కాదు’’ అంటూ నాటి విషయాల్ని వెల్లడించారు.
షూటింగ్ సమయంలో హీరో.. హీరోయిన్లు సినిమా బాగా వస్తుందనేవారు. సినిమా రష్ చూసినోళ్లంతా బాగుందనే వారు. నేను మాత్రం ఆ విషయాన్ని ప్రొడ్యూసర్ గారికి చెప్పండని అందరికి చెబుతుండేదానిని. అయితే.. సినిమాలో హీరో అయిన నాని అప్పటికి చిన్న హీరో కావటం.. నిత్య మీనన్. నేను పెద్దగా తెలీకపోవటంతో మొదటిరోజు ఎవరు వస్తారు? అని అనుకున్నా.
కానీ.. సినిమా చూసినోళ్లంతా బాగుందని చెప్పటం.. మొదటి షో అయ్యాక హిట్ టాక్ మొదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్ లో సినిమా చూద్దామని వెళితే.. రెండువేల మందితో సినిమా చూడటం చూసి.. కళ్లవెంట నీళ్లు వచ్చేశాయ్ అంటూ.. నాటి తీపి గురుతుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ ఒక్క మూమెంట్ తో అన్నేళ్లు పడిన కష్టం మొత్తం ఎగిరిపోయిందన్నారు. నిజమే కదా.. అపురూపమైన విజయం ఎదురైనప్పుడు అప్పటివరకు వెంటాడిన వేదన మాయం కావటం మామూలే.