నందిని రెడ్డికి అరుదైన గౌరవం

Update: 2018-03-06 11:01 GMT
దర్శకురాలు నందినీ రెడ్డి తన ఫీల్డ్ లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అలా మొదలైంది అంటూ అప్పుడెప్పుడో పెద్ద హిట్ కొట్టిన తర్వాత.. గతేడాది కళ్యాణ వైభోగమే అంటూ ఓ చిత్రంతో ఆడియన్స్ ను పలకరించిన నందినీ రెడ్డి.. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టు ప్రారంభించేందుకు ఉద్యుక్తురాలు అవుతోంది.

త్వరలోనే నందినీ రెడ్డి కొత్త సినిమాపై ప్రకటన రానుందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఇలాంటి సమయంలో.. ఆమెకు ఫుల్ జోష్ ఇచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈమెను సత్కరించాలని నిర్ణయించింది. మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా నందినీ రెడ్డిని సత్కరించనున్నారు. పలు రంగాలకు చెందిన మొత్తం 20 మంది మహిళలను గౌరవ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. ఫిలిం ఫీల్డ్ నుంచి ఇందుకు నందినీ రెడ్డిని ఎంపిక చేశారు. రీసెంట్ గా తెలుగు ఫెస్టివల్ కోసం ఒక పాటను కూడా డైరక్ట్ చేసింది నందిని రెడ్డి.

బహుశా అందుకే ఇలా అభినందించి ఉంటారని సినిమా వర్గాలు అనుకుంటున్నారు. అయితే.. కొత్త సినిమా ప్రకటనకు ముందు ఇలాంటి అవార్డ్.. అందులోనూ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్ మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చేదే. ఇక ప్రముఖ గాయని నిత్య సంతోషిణి కూడా సత్కారాన్ని పొందనుండడం విశేషం. ఈమెను సంగీతం విభాగంలో సత్కారానికి ఎంపిక చేసింది తెలంగాణ సర్కార్.


Tags:    

Similar News