కృష్ణవంశీ సినిమాలో నందిత?
బోలెడంత ప్రతిభ వున్న అచ్చ తెలుగమ్మాయి నందిత. తేజ స్కూల్ నుంచి నీకు నాకు సినిమాతో తెరకు పరియమైంది. ఆ తర్వాత ప్రేమకథా చిత్రమ్ - లవర్స్... ఇలా చాలా సినిమాలే చేసింది. ప్రతీ సినిమాలోనూ తన పాత్ర పరిధి మేరకు చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. మంచి నటి అని నిరూపించుకొంది. కానీ ఆ స్థాయిలో ఆమెకి ప్రోత్సాహమే అందడం లేదు. స్టార్స్ సినిమాలో ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా రాలేదు. దీంతో నందిత ప్రతిభంతా అడవి కాచిన వెన్నెలలా అయిపోయింది. పరిశ్రమ వర్గాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాయి. అయితే అనుకోకుండా ఇటీవల ఆమె ఓ లక్కీ ఛాన్స్ ని చేజిక్కించుకున్నట్టు తెలిసింది. కృష్ణవంశీ సినిమాలో నటించే అవకాశం నందితని వరించినట్టు సమాచారం.
కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం నక్షత్రం. సందీప్ కిషన్ కథానాయకుడు. ఆయన సరసన నటించే అవకాశం నందితకి దక్కిందని ప్రచారం సాగుతోంది. అయితే చిత్రబృందం అధికారికంగా మాత్రం ధృవీకరించలేదు. మొదట ఆ రోల్ కి కాజల్ - తాప్సిలాంటి కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరిగా నందితకే అవకాశం దక్కిందని తెలిసింది. కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ అంటే ఆషామాషీ కాదు. సినిమా రిజల్ట్ ఎలా వున్నా నటిగా మాత్రం ఓ వెలుగు వెలిగిపోవడం ఖాయం. సో... నందిత కూడా త్వరలోనే అలా వెలిగిపోనుందన్నమాట. స్వతహాగా తెలుగు భాషని అమితంగా ప్రేమించే దర్శకుడు కృష్ణవంశీ. ఆయన సినిమాలో ఓ తెలుగమ్మాయి నటిస్తుందంటే ఇక ఆ పాత్రలు ఎలా పండుతాయో ఊహించుకోవచ్చు. పోలీస్ కావాలని కలలగనే ఓ యువకుడి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.