మాకు సరైన ఛాన్సులు ఇవ్వట్లేదు మొర్రో అంటున్నారు చాలా మంది తెలుగమ్మాయిలు. అందుకే ఇతరత్రా పరిశ్రమలపై దృష్టిపెడుతున్నారు. అయితే నందిత మాత్రం అలాంటి కంప్లయింట్సేవీ లేకుండా దూసుకెళుతోంది. ఇటీవలే `కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ` చిత్రంతో అలరించిన ఆమె ప్రస్తుతం `శంకరాభరణం`లో యువ కథానాయకుడు నిఖిల్ తో కలిసి నటిస్తోంది. ఆ చిత్రం పూర్తి కాకమునుపే మరో ఛాన్స్ కొట్టింది నందిత. ఈసారి ఆమె నారా రోహిత్ తో ఆడిపాడనున్నట్టు సమాచారం.
నారా రోహిత్ కథానాయకుడిగా `ప్రేమ ఇష్క్ కాదల్` ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో `సావిత్రి` అనే సినిమా తెరకెక్కబోతోంది. అందులో కథానాయిక గురించి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. అయితే చివరిగా ఆ అవకాశం నందితకి దక్కినట్టు తెలుస్తోంది. నందిత ఇటీవల కాస్త స్టైల్ మార్చింది. కాసింత బొద్దుగా తయారై కమర్షియల్ కథానాయికకి కావల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయని తనని తాను ఎక్స్పోజ్ చేసుకొంది. దీంతో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తేజ దర్శకత్వంలో `నీకు నాను` అనే చిత్రంతో పరిచయమైన ఆమె `ప్రేమకథా చిత్రమ్`తో తొలి విజయాన్ని అందుకొంది. ఆ తర్వాత `లవర్స్`, `కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ` సినిమాలు నందితకి మంచి పేరును తీసుకొచ్చాయి. మలయాళంలోనూ పృథ్వీలాంటి కథానాయకుడితో ఓ సినిమా నటించింది. నందిత జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు అందుకొనేలా కనిపిస్తోంది.