నాని 'హాయ్ నాన్న' గ్లింప్స్... అదే సెంటిమెంట్ ఇంకాస్త గట్టిగా..

Update: 2023-07-13 12:22 GMT
నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకుని మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. అయితే ఇప్పుడు నాని ఆ తరహాలో కాకుండా కాస్త భిన్నంగా మరో సినిమాను పాన్ ఇండియా ప్రపంచంలోకి తీసుకురాబోతున్నాడు. ఈసారి మాస్ కంటెంట్ తో కాకుండా ఎమోషనల్ ఫాదర్ సెంటిమెంట్ తో టచ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదివరకే నాని జెర్సీ సినిమాలో పదేళ్ళ పిల్లాడికి తండ్రి పాత్రలో నటించి మంచి ఎమోషన్ ను హైలెట్ చేశాడు. ఇక ఇప్పుడు అలాంటి సెంటిమెంటును ఇంకాస్త స్ట్రాంగ్ గా కొత్తగా హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వైరా ప్రొడక్షన్లో శౌర్యువ్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న నాని 30వ సినిమా డాటర్ ఫాదర్ సెంటిమెంట్ తో రూపొందుతోంది అనే ముందే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక మొత్తానికి సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. సినిమాకు 'హాయ్ నాన్న' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇక పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ భాషలకు తగ్గట్టుగా ఉండేలా టైటిల్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ లో హీరోయిన్ మృనల్ టాగర్ ను కూడా హైలెట్ చేశారు.

అయితే ఆమె చిన్నారికి తల్లి పాత్రలో కనిపించడం లేదు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఆ చిన్నారి తల్లి దూరమైన తర్వాతనే మృణాల్ పాత్ర నాని జీవితంలోకి వస్తుందని చెప్పగానే చెప్పేశారు.

ఫస్ట్ గ్లింప్స్ లో ఆ చిన్నారికి స్నేహితురాలిగా హీరోయిన్ ఉండడం అలాగే ఆ తర్వాత ఆ పాప స్నేహితురాలిని తండ్రికి పరిచయం చేయడంతో ఈ కథ ఆసక్తిగా ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది. ఇక హీరోయిన్ కూడా హీరోని హాయ్ నాన్న అని పిలుస్తూ ఉండడంతో ఈ సినిమాలో వీరి మధ్య బాండింగ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక దర్శకుడు శౌర్యువ్ ఈ కథను ఎలాంటి లైన్ లో తీసుకువెళ్తాడు అనేది తెరపై చూడాలి. సినిమాను డిసెంబర్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక హాయ్ నాన్న సినిమాకు మలయాళం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హెషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి సినిమాలో సాంగ్స్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఇలాంటి కూల్ టైటిల్ తో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Full View


Similar News