అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ జీవితాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత రేడియో జాకిగా పని చేసి అనూహ్యంగా హీరో ఛాన్సును కొట్టేసి హిట్ అందుకున్న హీరో నాని. ఈ హీరో యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని తనదైన కామెడీ తరహా కథలతో ఆకట్టుకున్నాడు. ప్రతి సినిమాకి అభిమానులను పెంచుకుంటూ వెళుతూనే ఉన్నాడు.
అయితే అప్పుడప్పుడు కొన్ని వినూత్న కథలని కూడా ఎంచుకున్నాడు ఈ కుర్ర హీరో. ఎంత పెద్ద నటుడైనా తన మొదటి అవకాశాన్ని మొదటి సక్సెస్ ని ఎప్పుడు మరచిపోలేడు. జీవితంలో ఎప్పటికైనా తన జీవితాన్ని మలుపు తిప్పిన రోజును ఎదో ఒకసారి గుర్తు చేసుకోక తప్పదు. న్యాచురల్ స్టార్ నాని కూడా తన మొదటి సినిమా అష్టాచమ్మా కి సంబందించిన ఓ ఫోటోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అభిమానుల ఆదరణకు కృతజ్ఞతను తెలుపుకున్నాడు.
2008లో సెప్టెంబర్ 5న అష్టా చమ్మా సినిమాలో మోహన కృష్ణ ఇద్రగంటి దర్శకత్వంలో నవీన్ బాబు గంటా పెరును నానిగా మార్చుకొని వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా నానికి ఎంతో సక్సెస్ ని ఇచ్చింది. కలర్స్ స్వాతి - శ్రీనివాస్ అవసరాల -భార్గవి మరో ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ఆ సినిమా అప్పట్లో హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనం ఇవ్వడంతో నాని అప్పుడే ఓ ఫోటో దిగాడు. అయితే అష్టా చమ్మా రిలీజ్ అయ్యి కరెక్ట్ గా తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది. దీంతో నాని సోషల్ మీడియా లో ఫొటో పోస్ట్ చేసి '9 సంవత్సరాల క్రితం ఈ రోజు నా కుటుంబాన్ని పెద్దది చేయడం ప్రారంభించారు. అది అప్పటి నుండి పెరుగుతూనే వచ్చింది. నన్ను మిలో ఒకడిగా చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అని' ట్వీట్ చేశాడు నాని.
ఇక ప్రస్తుతం నాని - దిల్ రాజు ప్రొడక్షన్లో "ఎమ్ సి ఏ" అనే సినిమాను చేస్తున్నాడు. మరియు మేకాపార్ల గాంధీ దర్శకత్వంలో మరో సినిమా 'కృష్ణార్జున' ను కూడా మొదలుపెట్టేశాడు.