నేనూ తప్పులు చేశా: నాని

Update: 2018-03-11 07:07 GMT
ఒక ప్రముఖ దర్శకుడు మొన్నే తన ట్విట్టర్ లో నాని బోర్ కొట్టేంతగా హిట్లు కొడుతున్నాడు అని సరదాగా ఒక కామెంట్ పెట్టాడు. ఆయన మెచ్చుకోలుగా అన్నా వ్యంగ్యంగా అన్నా ఇది అక్షరాల నిజం. సాధారణ రొటీన్ కంటెంట్ తో కూడా సినిమాలను నిలబెట్టగల రేంజ్ కి నాని చేరుకున్నాడు అన్నది నిజం. మరీ దారుణమైన కంటెంట్ తో తీస్తే తప్ప యావరేజ్ స్టఫ్ తో సైతం పాతిక కోట్ల గ్యారెంటీతో నాని మార్కెట్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అందుకే కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. తనకు సింక్ అవ్వదు అనిపిస్తే ఎంత పెద్ద దర్శకుడి సినిమా అయినా నో చెప్పేస్తాను అంటున్న నాని అది పొగరు అని ప్రచారం చేయటం పట్ల ఒక మ్యాగజైన్ ఇంటర్వ్యూ లో విచారం వ్యక్తం చేసాడు. తాను ఏ కథ విన్నా ప్రేక్షకుడి కోణం నుంచే చూస్తానని, హీరోగా వింటే సమస్యలు తప్ప కలెక్షన్లు రావని స్పష్టం చేసాడు. కాలేజీ చదువులో ఒక్క హీరో ఫీచర్ లేని తాను అది గుర్తించే దర్శకత్వ శాఖలో అడుగుపెడితే చివరికి విధి తనను హీరో చేసే దాకా వదల్లేదు అని చెప్పుకొచ్చాడు.

ఇన్ని చెప్పిన తాను కూడా తప్పులు చేసానని ఒప్పుకున్న నాని వాటి వల్లే చేయకూడని వాటి గురించి నేర్చుకున్నానని చెప్పాడు. ఏదైనా సినిమా ఆడేస్తోంది అంటే వచ్చేది ఫ్లాప్ అవుతుందేమో అన్న భయమే తనను అప్రమత్తంగా ఉండేలా చేస్తోందన్న నాని మహామహులే పరాజయాలు చూస్తున్నప్పుడు తాను వాటికి సిద్ధంగా ఉండటం తన కెరీర్ కు చాలా అవసరమని చెప్పాడు. ప్రేక్షకులకు తన మీద మంచి అభిప్రాయం ఉండబట్టే పొరపాట్లను క్షమించి సినిమాలు హిట్ చేసి పెడుతున్నారని అది ఇష్టం వల్ల వచ్చిన అభిమానమని దాన్ని నిలబెట్టుకోవలసిన బాద్యత తన మీద ఉందని క్లారిటీ ఇచ్చాడు.

ఏప్రిల్ 12 విడుదల కానున్న కృష్ణార్జున యుద్ధం మీద నాని ఫాన్స్ కి భారీ హోప్స్ ఉన్నాయి. డ్యూయల్ రోల్ చేసిన వాటిలో జెండాపై కపిరాజు ఫ్లాప్ కాగా జెంటిల్ మెన్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ట్రైలర్ కూడా ఆల్ ఇన్ వన్ అనే ఫీలింగ్ కలిగించింది కాబట్టి అది నిజమైనా ఆశ్చర్యం లేదు.
Tags:    

Similar News