ఇద్దరు నానీల కృష్ణార్జున యుద్ధం

Update: 2017-07-15 06:43 GMT
ఆల్రెడీ ఇప్పటికే డబుల్ యాక్షన్లో రెండుసార్లు సినిమాలు చేశాడు నాని. ఒకసారి 'జండాపై కపిరాజు' అంటూ సందడి చేయడగా.. మరోసారి 'జెంటిల్మన్' అంటూ కనిపించాడు. కాకపోతే రెండుచోట్లా కూడా హీరో అండ్ విలన్ తరహాలో కన్ఫాంటేషన్ అంతగా వర్కవుట్ కాలేదు. ఒక సినిమా బాగున్నా ఆడలేదు.. ఇంకోటి మాత్రం స్ర్కీన్ ప్లే గట్టిగా ఉండటంతో పెద్ద హిట్టయిపోయింది. ఇప్పుడు మరోసారి నాని ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.

''కృష్ణార్జున'' అంటూ గతంలో ఎన్టీఆర్ వంటి స్టార్లు డబుల్ యాక్షన్ సినిమాలతో దూసుకొచ్చి సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ కాంబినేషన్లో ''కృష్ణార్జున యుద్దం'' కూడా వచ్చింది. ఇప్పుడు ఈ రెండో టైటిల్ తో నాని ఒక యాక్షన్ కామెడీ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో సత్తాచాటిన మేర్లపాక గాంధి ఈ సినిమాకు డైరక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. పైగా ఈ సినిమాకు ధృవ సినిమాకు సంగీతం అందించిన హిప్ హాప్ తమిళ సంగీతం అందించడం విశేషం. సినిమా కంటెంట్ విషయానికిస్తే.. నానితో నాని చేసే యుద్దమే సినిమా అని చెప్పకనే చెబుతోంది. మరి డబుల్ రోల్స్ లో నాని ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.

ఇకపోతే ఈ ఏడాది 'నేను లోకల్'తో ప్రూవ్ చేసుకున్న నాని.. ఇప్పుడు 'నిన్ను కోరి' సినిమాతో కూడా మంచి డిపెండబుల్ హీరో అనిపించుకుంటున్నాడు. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా కూడా నాని ప్రెజన్స్ తో సినిమాలకు నష్టం రావట్లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇకపోతే తదుపరి నాని రిలీజ్ చేసే సినిమా ఏంటంటే.. ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరాం డైరక్షన్లో చేస్తున్న యం.సి.ఎ.. మిడిల్ క్లాస్ అబ్బాయి!!
Tags:    

Similar News