పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా సెన్సేషన్ `భీమ్లానాయక్`. అభిమాన హీరో నటించిన క్రేజీ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని గత కొన్ని నెలలుగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ `భీమ్లానాయక్` ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. అయితే తెలుగు నేటి విటీకి అనుగుణంగా మార్పులు చేశారు. అంతకు మించి పవర్ స్టార్ ఇమేక్ ని దృష్టిలో పెట్టుకుని పాత్రలని రివర్స్ చేసి ఒరిజినల్ మేకర్స్ కే షాకిచ్చారు.
`అయ్యప్పనుమ్ కోషియుమ్`లో రానా పోషించిన పాత్ర కీలకంగా వుంటుంది. కానీ తెలుగుకు వచ్చే సరికి ఆ పాత్రని విలన్ ఛాయలు ఆపాదించి పవన్ పాత్రని హైలైట్ చేయడం `భీమ్లానాయక్` రీమేక్ ప్రత్యేకత. అంతే కాకుండా పవన్ కల్యాణ్ పాత్రని మలిచిన తీరు, పవన్ పలికిన సంభాషణలు అభిమానులతో పాటు స్టార్ హీరోలను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరికీ నచ్చడంతో తను ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.
ఒకే ఒక్క చిత్రంతో ఇప్పడు సాగర్ చంద్ర స్టార్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయారు. ఒక హీరోని అభిమానులకు చ్చే స్థాయిలో ఏ దర్శకుడు చూపించినా అతనితో సినిమాలు చేయాలని ప్రతీ హీరో ఎదురుచూస్తుంటాడు. ఇప్పుడు `భీమ్లానాయక్`తో లైమ్ లైట్ లోకి వచ్చేసిన సాగర్ చంద్ర కోసం చాలా మంది హీరోలు ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే ఇద్దరు హీరోలు సాగర్ చంద్ర తో టచ్ లో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ తో 14 రీల్స్ చేయాలనుకున్న మూవీ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే అదే ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ టేకప్ చేయబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా ఈ మూవీని నిర్మించాలని ప్లాన్ ఏస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సాగర్ చంద్ర ఓ పిరియాడికల్ డ్రామాతో సాగు కథని సిద్ధం చేశారు. ఇందు కోఒసం భారీ బడ్జెట్ అవుతుంది. ఆకారణంగానే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఆలోచనలో పడిందని, సాధ్యాసాధ్యాలని బట్టి ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ తో పాటు హీరోలు నాని, రామ్ కూడా సాగర్ చంద్ర తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారట. గతంలో సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన `అప్పట్లో ఒకడుండేవాడు` చిత్రం ఈ ఇద్దరు హీరోలని అమితంగా ఆకట్టుకుందట.
ఆ సినిమా చూసిన నాని, రామ్ దర్శకుడు సాగర్ చంద్రతో కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. త్వరలో సాగర్ ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు ప్రకటించే అవకాశం వుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వరుణ్ తేజ్ సినిమా మళ్లీ వాయిదా పడినా.. ఆలస్యం అయితే మాత్రం నాని లేదా రామ్ తో సాగర్ చంద్ర నెక్స్ట్ ప్రాజెక్ట్ వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.