గ్యాంగ్ లీడర్ అప్ డేట్స్ చెప్పిన నాని

Update: 2019-08-25 12:59 GMT
త్వరలోనే గ్యాంగ్ లీడర్ గా థియేటర్స్ లోకి రాబోతున్న హీరో నాని ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెట్టి తన బాధ్యతను నిర్వర్తించాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతున్న ప్రియాంకను - అలాగే విలన్ గా నటిస్తున్న కార్తికేయను పరిచయం చేసే భాద్యత నిర్మాతలు పెద్దాడిగా తన పైన పెట్టారాని చెప్తూ వారిద్దరినీ పరిచయం చేసి కాసేపు మీడియాతో ముచ్చటించారు.

నిజానికి విలన్ క్యారెక్టర్ కోసం ముగ్గురు హీరోలను అనుకున్నాం, అందులో కార్తికేయ ఒకడు. తను చేస్తాడో లేదో అన్న సందేహంతోనే మిగతా వారిని కూడా సంప్రదించాలనుకున్నాం. అయితే అనుకోకుండా కార్తికేయ అప్రోచ్ అయిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కార్తికేయ ను కలిసి కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాడని విక్రమ్ చెప్పగానే చాలా హ్యాపీ గా అనిపించింది. తను క్యారెక్టర్ తో అదరగొట్టేసాడు. అంటూ సినిమాలో కొట్టగలను కానీ రియల్ లైఫ్ లో కార్తికేయను డీల్ చేయలేనని, ఇప్పుడే వస్తా అని పారిపోయే రకమని తనపై తనే సరదాగా ఓ పంచ్ వేసుకున్నాడు.

అంతే కాదు గ్యాంగ్ లీడర్ కి సంబంధించి రెండు అప్డేట్స్ ఇచ్చాడు నేచురల్ స్టార్. గ్యాంగ్ లీడర్ ట్రైలర్ ను ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే అనిరుద్ తో కలిసి ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా చేశానని అది సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుందని తెలిపాడు. అయితే నాని ఉన్నపళంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఓ రీజన్ ఉంది. ఈరోజు అమెరికా వెళ్లబోతున్నాడు. ఓ వారం రోజుల తర్వాత అంటే సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు వస్తాడు. అందుకే వచ్చే లోపు తన ఫ్యాన్స్ కి కొన్ని అప్డేట్స్ తో పాటు గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు.
Tags:    

Similar News