అ... టైటిలే కాదు...సినిమా కూడా డిఫరెంట్ గా ఉంది. కొన్ని గంటల ముందే ఓవర్సీస్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక్కడ ఏమవుతుందో అనుకుంటే... ఇక్కడా అదే రిజల్ట్. వెరైటీ మూవీ తప్పకుండా చూడాలి అన్న టాక్ రావడంతో అ టీమ్ కాస్త ఊపిరిపీల్చుకుంది. ముఖ్యంగా నానీని మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ మూవీపై తాను సంపాదించిన సొమ్మంతా పెట్టాలంటే చాలా గట్స్ కావాలి కదా.
ఒకే రోజు రెండు సినిమాలు విడుదలయ్యాయి. అ... మనసుకు నచ్చింది. మనసుకు నచ్చింది సినిమా కృష్ణ కూతురు దర్శకురాలిగా తీసిని సినిమా. ఆ సినిమా ప్రమోషన్లలో మహేష్ బాబు కూడా పాల్గొన్నాడు. ఆ సినిమాకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. అయినా మనసుకు నచ్చింది మంచి టాక్ తెచ్చుకోలేకపోయింది. విదేశాల్లో మొదటి రోజు కేవలం 8,593 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అదే అ సినిమా లక్షా ఇరవై ఆరు వేల డాలర్లు వసూలు చేసింది. మనుసుకు నచ్చిందిలో మంచి తారాగణం లేకపోవడం - హీరోకు పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం - కథలో కూడా కొత్తదనం లేకపోవడం వల్లే నెగిటివ్ టాక్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
అ సినిమాలో మాత్రం తారాగణానికి ఏ మాత్రం లోటు లేదు. రెజీనా - కాజల్ - నిత్యా - అవసరాల - ప్రియదర్శి - మురళీ శర్మ లాంటి నటులతో పాటూ - చేప - చెట్టుకు వాయిస్ ఇచ్చిన నాని - రవితేజ కూడా సినిమాకు ప్లస్ అయ్యారు. ముఖ్యంగా కథ చాలా కొత్తగా ఉండడంతో అ సినిమా ముందు మనసుకు నచ్చింది నిలబడలేకపోయింది. మొత్తమ్మీద నానీ నిర్మాతగా తొలి హిట్ అందుకున్నట్టే.