జూనియర్ తో న్యాచురల్ స్టార్!

Update: 2019-03-29 10:09 GMT
నాచురల్ స్టార్ నాని ఈరోజు ఫుల్ ఖుష్ గా ఉన్నాడు. ఎందుకంటే నానిగారి అబ్బాయి అర్జున్ ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అర్జున్ అంటే కొంతమంది గుర్తుపట్టరేమో కానీ 'జున్ను' అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు.  అర్జున్ ముద్దుపేరు జున్ను.  ఓ ఏడాది నుంచి.. అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 28 నుండి నాని ట్విట్టర్ ఖాతా లో ఇప్పటివరకూ ఆ జున్ను బాబు గురించి వేసిన ట్వీట్ నే పిన్ చేసి పెట్టాడు.

ఈరోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొత్త ఫోటో ఒకటి పోస్ట్ చేసి "నాకు ఈరోజు రెండేళ్ళ వయసు వచ్చింది.  హ్యపీ బర్త్ డే రా జున్ను #నాన్న #జున్ను" అంటూ ట్వీట్ చేశాడు.  బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో జున్ను బాబు ఒక ఝకాస్ డ్రెస్ లో నాన్న దగ్గర నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇక నాన్నగారు అయిన న్యాచురల్ స్టార్.. అబ్బాయిని చూసి తెగ మురిసిపోతున్నారు.  నాని ఒకసారి నవ్వితే ఎవరైనా బుట్టలో పడిపోతారు. మరి అలాంటి నవ్వునే జూనియర్ కు దగ్గరుండి మరీ నేర్పిస్తున్నాడు. ఈ ట్వీట్ కు నాని అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. చాలామంది ఫ్యాన్స్ జున్నుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే  'జెర్సీ' ఏప్రిల్ 19 న రిలీజ్ కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News