నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా. అతడి కెరీర్ తొలి పాన్-ఇండియన్ సినిమా ఇది. దాంతో నాని తన సినిమాను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. దసరా మార్చి 30న విడుదల కానుండగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. ఇంతకుముందు దసరాను పురస్కరించుకుని తెలంగాణ- సిరిసిల్లలో జరిగిన సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీకి నాని హాజరయ్యారు. తర్వాత చెన్నైలోని ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో జరిగిన మిలన్ సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు దసరా ప్రమోషన్స్ కోసం నాని ముంబై వెళ్లాడు. హోలీ రోజు ముంబై గల్లీలో అతడి సందడి హాట్ టాపిక్ గా మారింది.
ఈరోజు ముంబైలో జరిగిన డంక్ ఫెస్ట్ -2023లో నాని పాల్గొన్నారు. హిందీ ప్రేక్షకుల కోసం అక్కడ దసరాను ప్రమోట్ చేసాడు. హోలీ 2023 సందర్భంగా జరుపుకునే ఈ ప్రత్యేక పండుగలో నాని ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నాడు. అతడికి ముంబై యువత నుండి ఘనమైన స్వాగతం లభించింది. డంక్ ఫెస్ట్ ఈవెంట్ లో హిందీ వెర్షన్ పాటలు డ్యాన్సులతో స్థానిక యువతతో కలిసి అలరించాడు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ - బాహుబలి-పుష్ప-ఆర్.ఆర్.ఆర్ -పఠాన్ లాంటి చిత్రాలతో ఇప్పుడంతా భారతీయ సినిమాగా మారిందని.. ఇక్కడ తెరకెక్కిన పఠాన్ మాది- అక్కడ తెరకెక్కిన దసరా మీది అని ప్రజలను ఉత్సాహపరిచాడు. ఉత్తరాది సినిమా దక్షిణాది సినిమా అనే తారతమ్యం ఇక ఉండదని కూడా అన్నారు. ముంబై హోలీ ఫెస్టివల్ లో నాని వ్యాఖ్యలు ఇప్పుడు యువతరంలో చర్చనీయాంశమయ్యాయి. తన సినిమా దసరాని తమ సినిమాగా భావించి ఆదరించాలని నాని తనదైన శైలిలో ప్రచారం చేసారు. మనమంతా ఒకటే.. భారతీయ సినిమా ఒకటే అనే భావనను ఉత్తరాది ప్రేక్షకుల్లో కలిగించేందుకు నాని చేస్తున్న ఈ ప్రచారం ఎగ్జయిట్ చేస్తోంది.
దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల రచన - దర్శకత్వం వహించారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల కథాంశంతో రూపొందిన చిత్రమిది. SLV సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దసరాలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. హోలీ సందర్భంగా మూడో సింగిల్ విడుదలైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.