గాడ్ ఫాదర్ తో నాని కన్ఫమ్ చేశాడు

Update: 2015-11-18 13:30 GMT
డైరెక్టర్ కావాలన్న కలతో ఇండస్ట్రీలోక అడుగుపెట్టి అనుకోకుండా హీరో అయిపోయాడు నాని. అతడిలోని యాక్టింగ్ స్కిల్స్ ను పసిగట్టి ‘అష్టాచెమ్మా’ సినిమాతో అతణ్ని హీరోగా పరిచయం చేసి తెలుగు తెరకు ఓ మంచి నటుణ్ని అందించిన ఘనత ఇంద్రగంటి మోహనకృష్ణకే దక్కుతుంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన నాని.. ఆ తర్వాత తన టాలెంటుతో మరిన్ని అవకాశాలు దక్కించుకున్నాడు, మంచి హిట్లు కొట్టాడు. తాజాగా ‘భలే భలే మగాడివోయ్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మాంచి ఊపుమీదున్నాడు.

అదే సమయంలో నాని గాడ్ ఫాదర్ పరిస్థితేం బాగా లేదు. ‘బందిపోటు’ లాంటి డిజాస్టర్ తీసి పాతాళానికి పడిపోయాడు ఇంద్రగంటి. ఇలాంటి సమయంలో ఇంద్రగంటిని ఆదుకోవడానికి నాని నడుం బిగించాడు. తనతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ కాంబినేషన్ గురించి కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి కానీ.. ఇప్పుడే నాని ట్విట్టర్ లో ఈ మూవీ గురించి కన్ఫమ్ చేశాడు. ఇంద్రగంటి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని.. ఆయనతో సినిమా చేయబోతున్న మాట వాస్తవమే అని ట్వీట్ పెట్టాడు నాని. ఈ సినిమాలో ‘బీరువా’ ఫేమ్ సురభి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాని.. దీని తర్వాత ఇంద్రగంటి మూవీ మొదలుపెడతాడు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారో ఇంకా తెలియలేదు.
Tags:    

Similar News