ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ లాంటి హీరోల హవా సాగిన రోజులే వేరు. అప్పట్లో స్టార్ హీరోలు ఏడాదికి ఐదారు సినిమాలైనా చేసేవాళ్లు. ఒకటి పోతే ఇంకోటైనా ఆడేది. అలా ఏడాదికి రెండు మూడు హిట్లయినా వాళ్ల ఖాతాలో ఉండేవి. కానీ తర్వాత తర్వాత రోజులు మారాయి. హీరోలు సినిమాలు తగ్గించేశారు. 90ల్లోకి వచ్చాక ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసే పరిస్థితి వచ్చింది. తర్వాత ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనమైపోయింది. ఐతే ఈ మధ్య మళ్లీ పరిస్థితి మారుతోంది. హీరోల జోరు పెరిగింది. ఒకే ఏడాది రెండు సినిమాలతో పలకరిస్తున్నారు. కొందరు హీరోలు ఏడాదిలో రెండు హిట్లు కూడా ఖాతాలో వేసుకుంటున్నారు.
ఐతే ఒకే ఏడాది మూడు హిట్లు కొట్టిన హీరోలు మాత్రం ఈ మధ్య కాలంలో ఎవరూ కనిపించరు. ఈ మధ్య కాలం అని ఏంటి.. గత రెండు మూడు దశాబ్దాల్లో ఒకే ఏడాది మూడు హిట్లు కొట్టిన హీరో తెలుగులో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం నాని ముందుంది. ఇప్పటికే ఈ ఏడాది కృష్ణగాడి వీర ప్రేమగాథ.. జెంటిల్ మన్ సినిమాలతో హిట్లు కొట్టాడు నాని. ఇప్పుడు ‘మజ్ను’గా పలకరించబోతున్నాడు. ముందు నుంచి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. ట్రైలర్ కూడా ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమా కూడా హిట్టు కావడం గ్యారెంటీ అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారంతా. అదే జరిగితే నాని అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంటాడు. దీని తర్వాత నాని నటిస్తున్న ‘నేను లోకల్’ కూడా ఈ ఏడాదే రిలీజవుతుంది. దాని సంగతేమొ కానీ.. ముందు ‘మజ్ను’తో హిట్టు కొడతాడేమో చూద్దాం.