దసరా.. 100 కోట్లు వస్తే ఏం లాభం?

Update: 2023-04-05 20:15 GMT
నాని హీరోగా రూపొందిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎవరో ఊహించని విధంగా డివైడ్ టాక్ తెచ్చుకుంది. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశాడు. నాని కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి వినిపించారు. అయితే ఈ సినిమా ఆయన కెరియర్ లోనే హిట్ సినిమాగా చెబుతూ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ కి కోటి రూపాయలు విలువ చేసే బిఎండబ్ల్యూ కారి గోడమే కాదు. సినిమాకు పనిచేసిన చాలామందికి దాదాపుగా 10 గ్రాముల బంగారు నాణేల గిఫ్ట్ గా ఇవ్వడం అయితే ఇదంతా ప్రమోషనల్ యాక్టివిటీలా కనిపిస్తోంది తప్ప నిజంగా ఆ మేర లాభాలు వచ్చాయా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత ఖర్చు పెట్టింది.

దాదాపు 65 కోట్లు ఇప్పటివరకు వచ్చిన షేర్ 53 కోట్ల వరకు ఉంది. నైజాం లాంటి ప్రాంతాల్లో జరిగే బిజినెస్ కంటే వచ్చిన లాభం ఎక్కువగా కనిపిస్తున్న కొన్ని ప్రాంతాలలో ఇంకా డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడులు కూడా వెనక్కి రాలేదు. సినిమా నిర్మాతక వ్యవహరించిన సుధాకర్ చెరుకూరి సేఫ్ అయ్యాడు కానీ నార్త్ లో నాలుగు కోట్లకు ఈ సినిమాని అమ్మితే ఇంకా రెండు కోట్లు కూడా వెనక్కి రాలేదని తెలుస్తోంది.

అన్ని ప్రాంతాల వారికి లాభాలు ఇవ్వని దసరా 100 కోట్లు కొడితే ఏం లాభం? అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే లాంగ్ రన్ ఉంటుందా అంటే? రేపటి రావణాసుర మీటర్ సినిమాలో దెబ్బకి ధియేటర్ల కౌంట్ తగ్గడంతో అది డౌట్ అని అంటున్నారు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News