వాల్ పోస్ట‌ర్` ఇచ్చే కిక్కే వేర‌ప్పా: నాని

Update: 2017-12-03 17:30 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ లోని యంగ్ హీరోల‌లో చాలామంది  సినిమా ఫ‌స్ట్ డే - ఫ‌స్ట్ షో టికెట్ల కోసం క్యూలైన్లలో నిల‌బ‌డ్డ‌వారే. ఆ రోజు ప్రేక్ష‌కుల కేరింత‌లు - ఈల‌ల మ‌ధ్య సినిమాను ఎంజాయ్ చేసిన వాళ్లే. క‌మెడియ‌న్ - హీరో సునీల్...తాను చిరంజీవి వీరాభిమానిన‌ని గ‌తంలో చాలా సార్లు చెప్పాడు. అదే త‌ర‌హాలో నేచుర‌ల్ స్టార్ నాని ....విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కు అభిమాని అట‌. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా నాని త‌న `సినిమా`స్టోరీ చెప్పాడు. సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోలో పేర్లు పడకముందే - చుట్టూ ప్రేక్ష‌కులు సందడిగా చూస్తే తాను చాలా ఎమోష‌న‌ల్ అయ్యేవాడిన‌ని నాని అన్నాడు. ఆ వాతావరణంలో తాను పెరిగాన‌ని - కానీ, ఇపుడు మ‌ల్టీ ప్లెక్స్ ల‌లో ఆ పరిస్థితి లేద‌న్నాడు. ప్ర‌స్తుతం చాలామంది న‌టులు ఇంట్లోనే సినిమాలు చూస్తుంటార‌ని, తాను మాత్రం మల్టీప్లెక్స్ కి వెళ్లి చూస్తుంటాన‌ని చెప్పాడు. తాను చిన్న‌త‌నంలో ఎక్కువ‌గా అమీర్ పేట్ స‌త్యం థియేటర్లో సినిమాలు చూశాన‌ని - ‘ఈగ’కి ముందు త‌న‌ ప్రతి సినిమా విడుదల సమయంలో ఆ థియేటర్ కి వెళ్లేవాడిన‌న్నాడు. అయితే, న‌టుల‌కు ప్రేక్ష‌కాదరణ పెరిగే కొద్దీ  అప్పట్లో చేసిన పనులు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయ‌ని, ఒకటి దక్కితే మరొకటి కోల్పోక తప్పద‌ని, నటులకి ఇది ఒక రకమైన ఆనందమ‌ని అన్నాడు.

త‌న‌కు వాల్‌ పోస్టర్ అంటే చాలా ఇష్టమ‌ని - తాను అమీర్ పేటలో ఉన్న‌పుడు సత్యం థియేటర్‌ కు వెళ్లేదారిలో ఎం.సి.జె గ్రౌండ్ ద‌గ్గ‌ర‌ గోడ మీద పోస్టర్ లు చూడ‌కుండా వెళ్లే వాడిని కాద‌ని అన్నాడు. ఓ సినిమా చూడాలనిపించేలా వాల్‌ పోస్టర్ ఇచ్చే కిక్ ను ఓ ట్రైలర్‌ - టీజర్‌ - సోషల్‌ మీడియా ఏదీ ఇవ్వలేద‌న్నాడు. పోస్టర్ లో ఏదో తెలియని ఓ సినిమాటిక్‌ హైప్‌ ఉందని త‌న‌ ఫీలింగ్ అని - అందుకే త‌న‌ నిర్మాణ సంస్థకు అదే పేరు పెట్టేశానని చెప్పాడు. ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నా ఒత్తిడికి గురికానని - బిజీగా ఉన్నట్లనిపించద‌ని అన్నాడు. కొందరు పని ఎక్కువైతే రిలాక్స్ అవ‌డానికి పార్టీలకో - టూర్‌ కో వెళ్తారని - తాను పనిలోనే రిలాక్స్ అవుతాన‌ని చెప్పాడు. ఖాళీగా ఉంటే తోచ‌ద‌ని - సినిమా పనులే త‌న‌కు టైంపాస్ అనా అన్నాడు. అందుకే సినిమా నిర్మాణాన్ని అదనపు భారంలా భావించ‌డం లేద‌ని - అదనపు వినోదంలా అనుకుంటాన‌ని - దానికి త‌గ్గ‌ట్లు త‌న ప్రొడక్ష‌న్ హౌస్ కు మంచి టీమ్‌ కూడా దొరికింద‌ని చెప్పాడు.
Tags:    

Similar News