వరుసపెట్టి హిట్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు హీరో నాని. అయితే ఈ న్యాచురల్ స్టార్ అసలు ఏ క్లబ్ కు చెందినవాడు అనేదే మాత్రం ఫైనల్స్ అవ్వాల్సి ఉంది. ఆ విషయం తెలియాలంటే ఇప్పుడు త్వరలో రిలీజ్ అవ్వబోతున్న ''మజ్ఞూ'' సినిమాతో గురుడు గట్టిగా కొట్టాలి. అప్పుడు అసలు ఈ యంగ్ హీరోకు ఇక తిరుగే ఉండదు. రేంజ్ మారిపోతుంది.
ఎవ్వరూ ఊహించని రీతిలో నాని నటించిన ''భలే భలే మగాడివోయ్'' సినిమా ఏకంగా 25 కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే నాని ఇక 20 కోట్ల క్లబ్ హీరోగా మారిపోతాడని అనుకుంటే.. అప్పుడు వచ్చిన ''కృష్ణగాడి వీర ప్రేమగాధ'' సినిమా మాత్రం 10 కోట్ల వరకే కలక్ట్ చేసి ఆగిపోవడం విడ్డూరం. సినిమా ఫైనల్ కలక్షన్లను నిర్మాతలు రిలీజ్ చేయకపోవడం ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఆ తరువాత రిలీజైన ''జెంటిల్మన్'' మాత్రం ఏకంగా 17.5+ కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే మాంచి కంటెంట్ కు నాని స్టార్డమ్ కలిస్తే రిజల్ట్ అలా ఉంటుందని ప్రూవ్ అయిపోయినట్లే. ఇప్పుడు మరి సరైన టైమ్ చూసుకుని ''మజ్ఞూ''తో వస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా ఖచ్చితంగా 25 కోట్ల షేర్ మార్కును టచ్ చేస్తుందని ఒక అంచనా. అలా చేస్తే మాత్రం ఇక నాని మార్కెట్ రేంజ్ వేరబ్బా అనుకోవాల్సిందే.
40 కోట్ల పైన తెచ్చే స్టార్ హీరోలు ఓ "అరడజను" మంది ఉన్న టాలీవుడ్లో.. 20 నుండి 30లో రఫ్ఫాడించే మిడ్ రేంజు హీరోలు మాత్రం కరువైపోయారు. రవితేజ - సాయిధరమ్ తేజ్ అండ్ గోపిచంద్ వంటి స్టార్లు ఈ స్లాట్ కోసం కష్టపడుతుంటే.. నాని మాత్రం వీళ్ళందరికంటే ముందే దూసుకుపోతున్నాడు. ఇక మజ్ఞూతో ఎక్కడ నుంచుంటాడో చూడాలి మరి.